రూ.2 లక్షల నగదు, 3 తులాల బంగారం బూడిద
నవతెలంగాణ- అచ్చంపేట
గ్యాస్ సిలిండర్ పేలి పూరి గుడిసె దగ్ధం అయిన సంఘటన అచ్చంపేట పట్టణంలో చోటు చేసుకుంది. అచ్చంపేట పట్టణంలోని సాయి నగర్ కాలనీలో గ్యాస్ సిలిండర్ పేలి గుడిసె దగ్ధమైంది. వివరాల ప్రకారం.. కల్వకుర్తి మండలం గుండూరు గ్రామానికి చెందిన శాంతమ్మ, రాములు దంపతులు గత 20 సంవత్సరాలుగా పట్టణంలో కూలి పని చేస్తూ జీవిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల సమీపంలో గల గుడిసె గ్యాస్ సిలిండర్ పేలి పూర్తిగా దగ్ధమైంది. చుట్టుపక్కల వారు గమనించి వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాదం లో రూ 2. లక్షలు నగదు, 3 తులాల బంగారు, 20 తులాల వెండి, టివిఎస్ (లూనా ) పూర్తిగా దగ్ధమయ్యాయని బాధితులు రోదిస్తూ తెలిపారు. కట్టుబట్టలతో బయటపడ్డామని ప్రభుత్వం తగిన సహాయం చేయాలని వారు కోరారు.
గ్యాస్ సిలిండర్ పేలి పూరి గుడిసె దగ్ధం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



