నవతెలంగాణ – వర్ధన్నపేట
వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఆదేశాల మేరకు పట్టణ కౌన్సిలర్, లు బి ఆర్ ఎస్ నాయకులు డివైడర్ పై ఉన్న చెట్లకు నీరు పోశారు. గుజ్జ పుల్లయ్య జ్ఞాపకార్థంతో 3వ డివిజన్ కౌన్సిలర్ గుజ్జ వీర రాఘవ రావు (మున్సిపల్ ప్లోర్ లీడర్ ) ఆధ్వర్యంలో వర్దన్నపేట పట్టణ కేంద్రంలోని నీడివైడర్ ల మధ్యలో ఉన్న చెట్లకు ట్యాంకర్ తెప్పించి నీటిని పోశారు. ఈ సందర్బంగా 3 వ కౌన్సిలర్ గుజ్జ వీర రాఘవ రావు మాట్లాడుతూ పచ్చని చెట్లు -భావితరాలకు ఆదర్శం అన్నారు మానవ జీవనానికి చెట్లు మనుగడ కాపాడుతుందన్నారు.
ఎండ తీవ్రతకు డివైడర్ ల మధ్యలో ఉన్న చెట్లు ఎండిపోతున్న క్రమంలో మున్సిపల్ సిబ్బంది పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ లు సిలివేరు కుమారస్వామి యాదవ్, తిరుపతి సురేష్, తుమ్మల అరుణ – శ్రీధర్, చిలువేరు రమ-రాజశేఖర్, బానోత్ జ్యోతి-నవీన్, పట్టణ అధ్యక్షులు గోధుమల మధుసూదన్,మండల అధ్యక్షులు తూల్ల కుమారస్వామి, బిఆర్ఎస్ నాయకులు తుమ్మల యాకయ్య,అంగోతు బిక్షపతి,పట్టణ సోషల్ మీడియా కన్వీనర్ సిలివేరు శ్రీధర్ యాదవ్, మాజీ కౌన్సిలర్ లు తుమ్మల రవీందర్,తోటకూరి రాజమణి, పూజారి రఘు, మాజీ పట్టణ అధ్యక్షులు తోటకూరి శ్రీధర్,మార్త సారంగపాణి,మాజీ పట్టణ ప్రధాన కార్యదర్శి డా. కొండేటి శ్రీనివాస్, ఎరుకొండ వేణు గోపాల్ రావు, పిట్టల రాజు,వసంత్ నాయక్,కోమాండ్ల వెంకట్ రెడ్డి,గడ్డం సంతోష్,రామగిరి ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.



