Friday, March 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మండలంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

మండలంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం శ్రీరామ నవమి వేడుకలను ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రంలోని రామాలయంలో సీతారాముల కల్యాణం వైభవోపేతంగా జరిగింది. బషీరాబాద్ లో సీతారాముల కళ్యాణం సందర్బంగా రాముల వారికి గ్రామ పంచాయితీ పాలకవర్గం, గ్రామ ప్రజల తరపున సర్పంచ్ బైకాన్ జమున మహేష్ దంపతులు పట్టు వస్త్రాలు, తాళంబ్రాలు సమర్పించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ వేడుకల్లో పాల్గొని రాముల వారి కల్యాణాన్ని తిలకించారు. అనంతరం అన్నదాన వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలోని తదితర గ్రామాల్లో జరిగిన పూజా కార్యక్రమాల్లో గ్రామ సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్, ఉప సర్పంచ్ కొత్తపల్లి అశోక్, ప్రజా ప్రతినిధులతో పాటు వివిధ పార్టీల నాయకులు, బషీరాబాద్ లో ఉప సర్పంచ్ చిలివేరి భూమేశ్వర్ దంపతులు, వార్డ్ సభ్యులు నెల్ల రమేష్, బందెల రరాజు, అంకడి శేఖర్, జగడం శ్రీనివాస్, దొంపాల్ రవి, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -