-తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమీషన్ చైర్మెన్ గోలి శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ – ఆమనగల్
భారతీయ పండుగలలో అత్యంత పవిత్రమైన పండుగలలో శ్రీరామనవమి పండుగ ఒకటని తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమీషన్ చైర్మెన్ గోలి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా శుక్రవారం నిర్వహించిన సీతారాముల కళ్యాణం సందర్భంగా కల్వకుర్తి నియోజకవర్గం ప్రజలకు గోలి శ్రీనివాస్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఆధ్యాత్మికత, ధర్మం, నీతి విలువలను పాటించాల్సిన బాధ్యతను ప్రతి ఒక్కరు ఈపండుగ ద్వారా గుర్తు చేసుకోవాలని ఆయన సూచించారు. శ్రీరాముని జీవితం మనకు న్యాయం, కర్తవ్యబద్ధత, కుటుంబ విలువలు ఎంత ముఖ్యమో తెలియజేస్తుందని అన్నారు. శ్రీరామనవమి పర్వదినం అందరో జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, ధర్మ మార్గంలో నడిపించాలని ఆయన పేర్కొన్నారు.
భారతీయ పండుగలలో అత్యంత పవిత్రమైనది ‘శ్రీరామనవమి’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



