Friday, March 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మృతుని కుటుంబానికి ఆర్థిక చేయూత

మృతుని కుటుంబానికి ఆర్థిక చేయూత

- Advertisement -

నవతెలంగాణ – చిన్నకోడూరు
మండల పరిధిలోని రామునిపట్ల గ్రామంలో నిరుపేద కుటుంబానికి ఆర్థిక చేయూత ఫౌండేషన్ అండగా నిలిచింది. గ్రామానికి చెందిన పెద్ద బెజ్జంకి దానయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఫౌండేషన్ సభ్యులు గురువారం బాధితుని ఇంటిని సందర్శించి వారి కుటుంబాన్ని పరామర్శించారు. మృతుని భార్య ఎల్లవ్వకు తమ వంతు సహాయంగా 50 కేజీల బియ్యం,పది రకాల నిత్యావసర సరుకులు రూ.3000 నగదు అందజేశారు.

ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న పేద కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ఈ చిన్నపాటి సాయం అందించినట్లు తెలిపారు. తమ వంతుగా బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కోయిల రమేష్ మస్కూరి స్వామి శ్రీకాంత్ జేరిపోతుల రాకేష్ దుబ్బాసి రమేష్  ఫౌండేషన్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -