నవతెలంగాణ-గోవిందరావుపేట
శ్రీ సీతారాముల కళ్యాణం మండల వ్యాప్తంగా శుక్రవారం ఊరు వాడ వాడ కన్నుల పండుగగా నిర్వహించారు. తెల్లవారుజాము నుండి ఆలయాలు శ్రీరాముని భక్తి గీతాలతో మారుమోగాయి. మధ్యాహ్నం 12 గంటల సమయానికి అభిజిత్ లగ్న సుముహూర్తాన శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. అర్చక స్వాములవారు స్వామివారి ముత్యాల హారము మంగళసూత్రము ప్రజలందరికీ ముందుంచి ఆశీర్వాదాల అనంతరం శ్రీ సీతారాముల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. మండలంలోని చల్వాయి గోవిందరావుపేట పసర బుసాపురం మచ్చాపురం బొల్లెపల్లి దుంపల్లిగూడెం మండలంలోని ప్రతి గ్రామంలో కళ్యాణాన్ని ఆయా గ్రామాల ప్రజలు ఆలయ కమిటీలు ఘనంగా నిర్వహించారు. రాజకీయ పార్టీల నాయకులు ఆర్థిక సహాయంతో పాటు వచ్చి ఆశీర్వాదం తీసుకుని వెళ్లారు.
కన్నుల పండుగగా శ్రీ సీతారాముల కళ్యాణం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



