Friday, March 27, 2026
E-PAPER
Homeకరీంనగర్ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు నిరంతరం నిఘా

ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు నిరంతరం నిఘా

- Advertisement -

మూడు నెలల్లో 45 కేసులు నమోదు
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవ
జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే
నవతెలంగాణ- రాజన్న సిరిసిల్ల

జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టే దిశగా పోలీసు యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టి నిఘాను కఠినతరం చేసి నిరంతర తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఇసుక త్రవ్వకాలు, రవాణా చేపడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వచ్చేనెల ఒకటో తేదీ నుంచి మన ఇసుక వాహనం ద్వారా ఇసుక సరఫరా చేయాలని,అక్రమంగా ఇసుక రవాణా చేసిన ,నిల్వలు ఉంచిన వారిపైనా కేసులు నమోదు చేసి,సంబంధిత వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందన్నారు.

గడిచిన మూడు నెలల వ్యవధిలో జిల్లాలో అక్రమ ఇసుక రవాణాపై వరుస దాడులు నిర్వహించి మొత్తం 45 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఇకపై కూడా అక్రమ ఇసుక రవాణాపై ఎలాంటి సడలింపు లేకుండా కఠినంగా వ్యవహరించాలని పోలీస్ స్టేషన్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు.
ఇసుక అక్రమ రవాణా లేదా అక్రమ నిల్వలపై ఎలాంటి సమాచారం ఉన్నా వెంటనే పోలీసులకు తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని అధికారులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -