Friday, March 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చేపూర్ లో ఘనంగా శ్రీరామనవమి ఉత్సవాలు

చేపూర్ లో ఘనంగా శ్రీరామనవమి ఉత్సవాలు

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్
మండలంలోని చేపూర్ గ్రామం హనుమాన్ మందిరం వద్ద శుక్రవారం శ్రీరామనవమి సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు, మీనుగు నాగరాజు ఆధ్వర్యంలో ఘనంగా శ్రీసీతారాముల కళ్యాణం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శ్రీసీతారాముల కళ్యాణం పూజా కార్యక్రమాలు గ్రామ పురోహితుడు, కిరణ్ కుమార్ జ్యోషి  నిర్వహించారు. 

ఈ కార్యక్రమంలో  గ్రామ సర్పంచ్ సారంగి శాంతి కుమార్, ఉప సర్పంచ్ ప్రముఖ న్యాయవాది సింధూకర్ చరణ్, గ్రామ వార్డు సభ్యులు, గ్రామ అభివృద్ధి కమిటీ ప్రధాన కార్యదర్శి సురకంటి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు సూరినీడ దశరథ్, ముఖ్య సలహాదారుడు సొక్కం సంజీవ్, కోశాధికారి శ్రీనివాస్, సలహాదారుడు  కంపదండి సాయన్న, సభ్యులు బట్టు సురేష్, పట్నం నడిపి లింగన్న, అగల్ దివిటీ పున్ని తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -