Saturday, March 28, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఅమెరికా సైనిక బలం బండారం

అమెరికా సైనిక బలం బండారం

- Advertisement -

ప్రపంచమంతటా ఎదురవుతున్న అంతుపట్టని ప్రశ్న ఒక్కటే! ఫిబ్రవరి 28న అయతుల్లా ఖమేని ప్రాణాలు బలిగొనడం ద్వారా అమెరికా-ఇజ్రాయిల్‌ ప్రారంభించిన దురాక్రమణ యుద్ధం తుది ఫలితమెలా వుండబోతోంది? అని. ఆ తదనంతరం ఇరాన్‌ సైనిక పౌర వ్యవస్థలు రెండిటిపైనా భయానకమైన దాడులు జరిగాయి. మార్చి 21న కూడా డోనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌కు ఒక ఏకపక్ష బెదిరింపు పంపించారు. అది కూడా తనకెంతో ప్రియతమమైన వేదిక ‘ట్రూత్‌ సోషల్‌’ ద్వారా. హార్ముజ్‌ జలసంధిలో నౌకల రాకపోకలకు ఎలాంటి అవరోధాలు లేకుండా తొలగించక పోయినట్టయితే ఇదివరకెన్నడూ ఎరగని స్థాయిలో విధ్వంసం చేస్తామని బెదిరింపుతో ఆ పోస్టు వుంది. అంతేగాక ఇరాన్‌ విద్యుత్‌ ఇంధన వ్యవస్థ మొత్తాన్ని విచ్ఛిన్నం చేయడమేగాక సర్వనాశనం చేస్తామని కూడా ట్రంప్‌ దాంట్లో బెదిరింపులకు దిగారు.

అయితే ఇరాన్‌ దానికి బెదిరిపోలేదు సరికదా ఇంకా తీవ్రమైన ప్రమాదకర ప్రతిహెచ్చరిక చేసింది. అమెరికా గనక నిజంగా అంతకు తెగించేట్టయితే మొత్తం ఇజ్రాయిల్‌, గల్ఫ్‌ దేశాల ఇంధన వ్యవస్థలను ధ్వంసం చేస్తానని ఇరాన్‌ ప్రతిహెచ్చరిక చేసింది. దాంతో వెనక్కు తగ్గిన ట్రంప్‌ వెంటనే తోక ముడిచాడు. మార్చి 23న ట్రంప్‌ స్పష్టంగా వెనక్కి తగ్గుతూ ఈ విధంగా పోస్ట్‌ పెట్టాడు. ‘సరే. మధ్య ప్రాచ్యంలో మా శత్రుత్వాలను సంపూర్తిగా ముగించే దిశలో అమెరికా, ఇరాన్‌ గత రెండు రోజులుగా చాలా ఉపయోగకరమైన చర్చలు జరిపాయి. ఈ లోతైన, సవివరమైన, నిర్మాణాత్మకమైన ఈ చర్చల స్ఫూర్తి సారాంశం ఆధారంగా వచ్చే వారం పొడుగునా కూడా చర్చలు కొనసాగుతాయి. ఇరాన్‌ విద్యుత్‌ వ్యవస్థలపై, మౌలిక సదుపాయాలపై అన్ని సైనిక దాడులను అయిదు రోజులపాటు నిలిపి వేయవలసిందిగా యుద్ధ విభాగాన్ని నేను ఆదేశించాను. ప్రస్తుతం జరిగే సమావేశాల ఫలితాలను బట్టి తర్వాత నిర్ణయం వుంటుంది.” సైనిక పరిభాషలో ప్రస్తుత ఘటనా క్రమాన్ని బట్టి చూస్తే అంతుపట్టని పైప్రశ్నకు ఒకే జవాబు దొరుకుతుంది. ”ప్రస్తుతానికి ఒక విరామం”.

కుప్పకూలిన గొప్పలు!
ఈ ఉమ్మడి సైనిక దాడి ప్రారంభించిన నాటి నుంచి చూస్తే ఇజ్రాయిల్‌-అమెరికాలు ఏదో కొన్ని గంటలు లేదంటే కొన్ని రోజులలో మొత్తం పని పూర్తయిపోతుందని విసుగూ విరామం లేకుండా చెబుతూనే వచ్చాయి. ఇరాన్‌ ఇస్లామిక్‌ రిపబ్లిక్‌లో ఒక అంతర్గత తిరుగుబాటు రావడం తప్పక జరుగుతుందనే దృశ్యచిత్రణ ఇచ్చిన అవగాహనతో ఈ కాలపట్టిక తయారైంది. అంతకు ముందు ఇరాన్‌ వ్యాపితంగా ప్రభుత్వంపై విస్త్రుతమైన ప్రతికూలత వ్యక్తమైన నేపథ్యంలో మొస్సాద్‌ గూఢచారి సంస్థ అంతా అనుకున్నట్టు చకచకా జరిగిపోతుందని లెక్క వేసుకుంది. సైనిక ఘర్షణ సమయంలో నెతన్యాహు దాడి గురించి, అమెరికా సాయుధ దళాల మోహరింపు గురించి పైకే మాట్లాడుతూ వచ్చాడు.

ఎందుకంటే అవి గత నాలుగు దశాబ్దాలుగా ఆ పని చేస్తూ వస్తున్నాయి. మరోవైపున అమెరికాలోనైతే తాము ఇందులో పాలుపంచుకోవడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అధ్యక్షుడు ట్రంప్‌ పాలనాధికారంతోనే పూర్తి స్థాయిలో అమెరికా సైనిక బలగాలను దించడం నమ్మశక్యంగాని విషయంగా భావించబడింది. అమెరికా కాంగ్రెస్‌ అనుమతి లేకుండా, నిర్దేశిత లక్ష్యాలు స్పష్టంగా లేకుండా ఇలా చేయడం స్పష్టంగా రాజ్యాంగ విరుద్ధం గనక ఈ అపనమ్మకం మరింత బలంగా మారింది. దక్షిణ అమెరికా తోమహాక్‌ క్షిపణుల కారణంగా ఇరాన్‌లో 165 మంది బడికి వెళ్లే బాలికలను బలిగొన్న విషాద ఘటన కూడా ఇందుకు కారణమైంది. ఇరాన్‌కు దారుణమైన నష్టాలు సంభవించాయి. ప్రత్యేకించి ఆ దేశ అత్యున్నత సైనిక భద్రతా బలగాల నాయకత్వాన్ని గురిపెట్టి మరీ ప్రాణాలు తీసిన ఘటనలు జరిగాయి. అయినా సరే ఇరాన్‌ కుంగిపోలేదు సరికదా టెహ్రాన్‌ మరింత గట్టిగా నిలబడింది.

ఇరాన్‌ వ్యూహాత్మక, యుద్ధనీతి యంత్రాంగం వికేంద్రీకృత దొంతరలు యథాతథంగా నిలవడమే గాదు, ప్రతీకారం కూడా చేయగలిగాయి. ఇరాన్‌ సైనిక రక్షణ, ఆర్థిక బలం అత్యంత సమర్థమైనవిగా తేలింది. చవకగా రూపొందించిన డ్రోన్లు, క్షిపణులు అతి ఖరీదైన అత్యాధునికమైన అమెరికా-ఇజ్రాయిల్‌ ఆయుధాల అగ్ని వర్షాన్ని తట్టుకున్నాయి. కేవలం సైనికంగానే ఇజ్రాయిల్‌ పౌర సదుపాయాలను కూడా ఇరాన్‌ నష్టపరచగలిగింది. గల్ఫ్‌ దేశాలన్నిటా వున్న అమెరికా సైనిక స్థావరాలను ఇరాన్‌ లక్ష్యంగా చేసుకున్నది. హార్ముజ్‌ జలసంధిని మూసి వేయడం చివరి చావు దెబ్బగా తయారైంది. ఎందుకంటే హార్ముజ్‌ ద్వారా ప్రపంచ చమురు సహజ వాయు సరఫరా వ్యవస్థలో ఇరవై శాతం జరుగుతుంది. ఇంధన ధరలు ఇళ్ల పైకప్పులు లేపేయడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతింది. ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు కూడా దారుణంగా కూలిపోయాయి.

ట్రంప్‌ సంధి ప్రలాపాలు
గత ఏడు రోజుల సైనిక చర్యల తర్వాత ట్రంప్‌ ‘ట్రూత్‌ సోషల్‌’లో రోజువారీ బట్వాడాలు చూడటం చాలా ఆసక్తికరమైన వ్యవహారంగా వుంటుంది. అన్నీ తలకిందులై పైకి కిందకు తికమకగా మారాయి. అందువల్లనే అంతర్జాతీయంగానూ, దేశంలోనూ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఫలితంగా అధ్యక్షుడు ట్రంప్‌ బయటపడటానికి ఏదో ఒక మార్గం వెతుక్కుంటున్నాడు. హార్ముజ్‌ జలసంధి విముక్తి కోసం సైనిక చర్యకు కలిసి రావాలన్న ఆయన ఆక్రందన పిలుపును…ఒక దేశం తర్వాత ఒక దేశం ఐరోపాలో ఇతర చోట్ల పాత మిత్రులు, మార్యాదగా తిప్పికొట్టడం… కొన్నిసార్లు మొరటుగానే తిరస్కరించడం జరిగింది.

అయితే ట్రంప్‌ దురవస్థ ఎంత దారుణంగా వుందంటే విరామం ప్రకటిస్తూ ఆయన పోస్టు చేసిన కొద్ది నిముషాలలోనే ఇరానియన్లు నిర్దాక్షిణ్యంగా విరుచుకు పడ్డారు. సంప్రదింపులు కాదు కదా అసలు ఎలాంటి చర్చలూ జరిగిందే లేదని ఖండించారు. ఇలాంటి దురాక్రమణ మళ్లీ జరగబోదని హామీ లభించేదాకా తాము ముందుకు పోతూనే వుంటామని వారు గట్టిగా ప్రకటించారు. పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలలో కార్యకలాపాలు నిలిపేసి, చేసిన నష్టానికి పరిహారం కట్టివ్వాలని వారు కోరారు. అందువల్ల- చివరకు విజేతలెవరు పరాజితులయ్యేదెవరన్న ఊహాగానాల్లోకి పోనవసరం లేదుగాని ఇప్పుడు చూస్తున్నది కేవలం విరామం కాదు.

మోడీ దురవస్థ
అయితే అమెరికా సామ్రాజ్యవాదం, యూదు జాత్యహంకార ఇజ్రాయిల్‌ చట్ట విరుద్ధంగా తెచ్చిపెట్టిన ఈ అనవసరమైన నివార్యమైన ఈ వినాశకర మృత్యునృత్యంలో ఒక దయనీయ అధ్యాయం స్వయం ప్రకటిత విశ్వ గురుడైన నరేంద్ర మోడీది. మార్చి 23న లోక్‌సభలో ఆయన ప్రసంగం ఈ విషాదకర ఫలితానికి సాక్షీభూతంగా నిలు స్తుంది. పశ్చిమాసియాలో సైనిక దుస్సాహసం భారతదేశాన్ని ఎంతటి కష్టాల్లోకి నెట్టిందో ఆయన వరుసగా ఏకరువు పెడుతూ మాట్లాడారు. అయితే ఈ వినాశకర పర్వం విచ్చుకోవడానికి మూల కారణమేమిటో ఒప్పుకోవడానికి ఆయన ఇసుమంత ప్రయత్నం కూడా చేయలేదు. నెతన్యాహూను మృత్యు పరిష్వంగంలో భారత దేశం తన మాతృభూమి అయితే ఇజ్రాయిల్‌ తన పితృభూమి అని నొక్కి వక్కాణించిన అంశం మర్చిపోయారు.

ఇక డోనాల్డ్‌ ట్రంప్‌తోనైతే ఎప్పుడూ తనను తక్కువ చేస్తున్న తీరునూ చెప్పలేదు. ఒక్కటంటే ఒక్కమాట ఖండన లేదు. ఆయన లెనిన్‌ రాసిన ‘సామ్రాజ్యవాదం-పెట్టుబడిదారీ విధానం అత్యున్నత దశ’ అనే గ్రంథాన్ని చూడాలను కుంటాడని మనం ఆశించలేము. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బలీయమైన శక్తిగా ఆవిర్భవిస్తున్న చైనా సారథ్యంలో ప్రస్తుతం రూపుదాలుస్తున్న బహుళ ధృవ ప్రపంచాన్ని తట్టుకోలేని ట్రంప్‌ కాలపు పచ్చి మితవాద దుందుడుకు పోకడల హాహాకారాలను ఆయన గ్రహిస్తారనీ అనుకోలేము. ఇలాంటి సంక్లిష్టమైన సంధి దశలో మొత్తం తన వ్యవ హారాలన్నీ ఒకే సామ్రాజ్యవాదపు బోగీకి తగిలించడం ద్వారా భారతదేశం మనుగడ సాగించడం సాధ్యమయ్యేది కాదు.

(మార్చి 25 ‘పీపుల్స్‌ డెమోక్రసీ’ సంపాదకీయం)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -