Saturday, March 28, 2026
E-PAPER
Homeఆటలుచాంపియన్‌ ఇంపీరియల్‌ క్లబ్‌

చాంపియన్‌ ఇంపీరియల్‌ క్లబ్‌

- Advertisement -

హైదరాబాద్‌ : హెచ్‌సీఏ బి డివిజన్‌ (రెండు రోజులు) లీగ్‌ చాంపియన్‌గా ఇంపీరియల్‌ క్రికెట్‌ క్లబ్‌ నిలిచింది. శుక్రవారం ఎన్‌ఎఫ్‌సీ గ్రౌండ్‌లో జరిగిన ఫైనల్లో చార్మినార్‌ క్రికెట్‌ క్లబ్‌పై ఇంపీరియల్‌ సీసీ గెలుపొందింది. చార్మినార్‌ తొలుత 71 ఓవర్లలో 397/10 పరుగులు చేసింది. సాహిల్‌ సింగ్‌ 84, సంకీర్త్‌ 80, ఆదిత్య 57 రాణించారు. ఇంపీరియల్‌ బౌలర్‌ సిద్దూ నాయక్‌ (5/83) ఐదు వికెట్ల ప్రదర్శనతో మెరిశాడు. ఇంపీరియల్‌ సీసీ 85 ఓవర్లలో 401/9 పరుగులు చేసింది. లోక్‌నాథ్‌ (103), లోకేశ్‌ (105) సెంచరీలు సాధించగా, సిద్దూ నాయక్‌ 69 అర్థ సెంచరీతో రాణించాడు. విజేతగా నిలిచిన ఇంపీరియల్‌ సీసీ జట్టు, చార్మినార్‌ సీసీ సహా లీగ్‌లో పోటీపడిన జట్లు, ఆటగాళ్లకు హెచ్‌సీఏ కార్యదర్శి జీవన్‌రెడ్డి అభినందనలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -