Saturday, March 28, 2026
E-PAPER
Homeసినిమాతమ తండ్రితో ప్రతి స్టూడెంట్‌ చూడాల్సిన సిినిమా

తమ తండ్రితో ప్రతి స్టూడెంట్‌ చూడాల్సిన సిినిమా

- Advertisement -

శర్వానంద్‌ హీరోగా యువీ క్రియేషన్స్‌ బ్యానర్‌ మీద వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్‌ ఉప్పలపాటి సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘బైకర్‌’. విక్రమ్‌ రెడ్డి సమర్పణలో ఈ మూవీని అభిలాష్‌ రెడ్డి తెరకెక్కించారు. ఈ మూవీలో డాక్టర్‌ రాజశేఖర్‌ కీలక పాత్రని పోషించగా.. మాళవిక నాయర్‌ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాని ఏప్రిల్‌ 3న రిలీజ్‌ చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మదనపల్లిలోని మిట్స్‌లో ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా శర్వానంద్‌ మాట్లాడుతూ, ‘జీవితం అనేది సినిమాలాంటిది కాదు. జీవితంలో బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఉండదు. కానీ స్ట్రగుల్స్‌ మాత్రం ఉంటాయి. జీవితంలో కన్ఫ్యూజర్‌, క్రైయింగ్‌, లోన్లీ స్టేజ్‌ అనేవి కచ్చితంగా ఉంటాయి. వీటిని ప్రతీ ఒక్కరూ దాటుకుని రావాల్సిందే. నేనూ ఇవన్నీ దాటుకునే వచ్చాను. నేను బిలో యావరేజ్‌ స్టూడెంట్‌ని. నేను ఎందుకూ పనికి రాను అని అందరూ తిట్టేవాళ్లు. హీరో అవుతాను అంటే.. ఎవ్వరూ నమ్మలేదు. చాలా మంది అవమానించారు.

23 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. ‘బైకర్‌’ నా కెరీర్‌లో 36వ చిత్రం. జీవితంలో ఏదైనా కొత్తగా ప్రయత్నిద్దామని అనుకుంటే అందరూ అడ్డుకట్ట వేస్తుంటారు. కానీ ఎవ్వరి మాట వినొద్దు. పెద్ద కలలు కనండి. తలుచుకుంటే ఏదైనా చేయగలం. నిరుత్సాహ పరిచేలా ఎవరైనా మాట్లాడితే, వారి మాటలు వినొద్దు. నేనే చేయగలిగాను అంటే మీరు (విద్యార్థులు) ఏదైనా సాధించగలరు. మన సక్సెస్‌తోనే అందరికీ సమాధానం చెప్పాలి. కష్టంలో ఉండే స్నేహితులు, వదిలేసిన వాళ్లని, కష్టపెట్టిన వాళ్లని మర్చిపోకండి. అందరినీ కచ్చితంగా గుర్తు పెట్టుకోండి. లైఫ్‌లో ఎంజాయ్ మెంట్‌ కూడా ఉండాలి. జర్నీని ఎంజాయ్ చేస్తూ వెళ్లాలి. పక్కవారితో పిల్లల్ని ఎప్పుడూ పోల్చొద్దని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నాను. తల్లిదండ్రులు సపోర్ట్‌ చేస్తే పిల్లలు ఏదైనా సాధిస్తారు. ప్రతీ ఒక్క స్టూడెంట్‌ తప్పకుండా ఫాదర్‌తో కలిసి ఈ మూవీని చూడండి. సంక్రాంతికి చెప్పి హిట్టు కొట్టా. సమ్మర్‌కి వస్తున్నా.. మళ్లీ హిట్టు కొడతా’ అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -