అగ్ర కథానాయకుడు రామ్ చరణ్ పుట్టినరోజు శుక్రవారం. ఈ సందర్భంగా ఆయన మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా మూవీ ‘పెద్ది’ మేకర్స్ బర్త్ డే, శ్రీరామ నవమిని పురస్కరించుకుని అభిమానులకు ఒక పవర్‌ఫుల్ కానుకను అందించారు. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో, వెంకట సతీష్ కిలారు వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మించగా, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో రూపొందుతున్న ‘పెద్ది’ పెహల్వాన్ గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘కుస్తీ అంటే బంతితో బ్యాటుకు ఎదురెళ్లే ఆట కాదురా.. పాణంతో సావుకు ఎదురెళ్లే ఆట’ అనే పవర్ ఫుల్ వాయిస్‌తో గ్లింప్స్ మొదలౌతుంది.
ఆ తర్వాత విజువల్స్ ఆడియన్స్‌ని కుస్తీ పోటీలోకి తీసుకువెళ్తాయి. అక్కడ దుమ్ము, చెమట, సంకల్ప బలం ప్రతి ఫ్రేమ్‌లోనూ కట్టిపడేశాయి. కఠినమైన శిక్షణను తట్టుకుంటూ, ఇటుక గోడలను ఎక్కుతూ, ఇసుక సంచులను ఎత్తుతూ, అచంచలమైన సంకల్పంతో గదలో ప్రావీణ్యం సంపాదిస్తున్న పెద్ది పహిల్వాన్ ఎదుగుదల అద్భుతంగా వుంది. రామ్ చరణ్ ట్రాన్స్‌ఫర్మేషన్ మెస్మరైజింగ్‌గా ఉంది. సిక్స్-ప్యాక్ అబ్స్, దృఢమైన కండరాలు, ఇంటెన్స్ ప్రజెన్స్ తో నిజమైన పహిల్వాన్‌గా ఒదిగిపోయారు.
రామ్ చరణ్ గదను పట్టుకొని హనుమంతుడిలా కనిపించిన సన్నివేశం అద్భుతం, శ్రీరామ నవమి ఆధ్యాత్మిక ఉత్సాహానికి సరిగ్గా సరిపోయేలా వుంది. ”చూడుమే… ఆటే నా పోగరు…”అని చరణ్ పలికిన ఫైనల్ డైలాగ్ అదిరిపోయింది. దర్శకుడు బుచ్చి బాబు సానా, రామ్ చరణ్‌ను మునుపెన్నడూ చూడని అవతార్‌లో చూపిస్తూ, గూస్ బంప్స్ ట్రీట్ ని అందించారు. ప్రతి ఫ్రేమ్ విజల్ వేసే ఎనర్జీతో సినిమాపై భారీ అంచనాలను పెంచుతుంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోందని చిత్ర బృందం మరోసారి స్పష్టం చేసింది.
ఆటే..నా పొగరు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



