– ఇరాన్ సంచలన నిర్ణయం
– శత్రు దేశాలపై ఇరాన్ ప్రతీకారం
టెహ్రాన్ : పశ్చిమాసియా యుద్ధం మరింత తీవ్రం అవుతోంది. ట్రంప్ శాంతి చర్చలంటూనే అధనపు సైన్యాలను తరలిస్తున్నారు. మరోవైపు ఇజ్రాయిల్ నివాసాలే టార్గెట్‌గా దాడులు చేస్తుంది. ఈ నేపధ్యంలో ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికా, ఇజ్రాయెల్ మిత్రదేశాలకు హార్ముజ్‌ను మూసేస్తున్నట్లు ఇరాన్ ఐఆర్‌జిసి శుక్రవారం ప్రకటించింది. శత్రువులతో కలిసుండే దేశాలకు ఏ మాత్రం అనుమతి ఇవ్వమని పేర్కొంది. ఇప్పటికే ఆయా దేశాలకు చెందిన మూడు నౌకలను కూడా వెనక్కి పంపేసినట్లు వెల్లడించింది. ఇక అమెరికా బలగాలు ఉన్న ప్రాంతంలోని పౌరులు దూరంగా వెళ్లిపోవాలని ఇరాన్ హెచ్చరించింది. గత నెల రోజులుగా జరుగుతున్న యుద్ధంతో ప్రపంచ దేశాల్లో చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది. కోట్లాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి తరుణంలో హార్ముజ్ మూసివేతతో సంక్షోభం మరింత తీవ్రతరమవుతుందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హార్ముజ్ జలసంధిని తెరవకపోతే విద్యుత్ ప్లాంట్లపై దాడి చేస్తామని ట్రంప్ బెదిరించిన సంగతి తెలిసిందే. ఇక ఇరాన్ ప్రాధేయపడడంతోనే చర్చల కోసం ఐదు రోజులు దాడులు ఆపేస్తున్నట్లు చెప్పిర ట్రంప్ తాజాగా ఆ గడువు కూడా ఏప్రిల్ 6 వరకు పెంచారు. అయితే అమెరికాతో ఎలాంటి చర్చలు లేవని ఇరాన్ ప్రకటించింది. అయితే ఇరాన్‌కు మిత్ర దేశాల నౌకలను అనుమతిస్తామని తెలిపింది.
హార్ముజ్ జలసంధి మూసివేత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



