Saturday, March 28, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంలోక్‌భవన్‌లో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

లోక్‌భవన్‌లో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

- Advertisement -

పాల్గొన్న గవర్నర్‌ శివ్‌ ప్రతాప్‌ శుక్లా
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్ర గవర్నర్‌ అధికార నిలయమైన లోక్‌భవన్‌లో శ్రీరామనవమి వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. గవర్నర్‌ శివ్‌ ప్రతాప్‌ శుక్లా దంపతులు సీతారాముల కల్యాణ మహోత్సవంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడి అధికారులు, సిబ్బందికి గవర్నర్‌ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం భాగ్యనగర్‌ శ్రీరామనవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొని రథయాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో లోక్‌భవన్‌ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -