నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టును వేగవంతం చేసేందుకు అడుగు వేసింది. ప్రాజెక్టు ప్రణాళిక, సమన్వయం, అమలును పర్యవేక్షించేందుకు ముగ్గురు మంత్రులతో కూడిన క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే.రామకృష్ణా రావు జీవో నెం.406ను విడుదల చేశారు. ఈ క్యాబినెట్ సబ్ కమిటీకి డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. సభ్యులుగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఈ కమిటీకి కన్వీనర్‌గా వ్యవహరించన్నారు.
మూసీ పునరుజ్జీవంపై ప్రభుత్వం కీలక నిర్ణయం
- Advertisement -
- Advertisement -



