Saturday, March 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాలల పరిరక్షణ కమిటీ ఏర్పాటు

బాలల పరిరక్షణ కమిటీ ఏర్పాటు

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవూర
మండలంలోని సంగారం, తుంగతుర్తి గ్రామాల్లో జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో శనివారం గ్రామ బాలల పరిరక్షణ కమిటీ స్థానిక సర్పంచి మెండే ముత్యాలు ఆధ్వర్యంలో  అంగన్వాడి టీచర్లు,  పాఠశాల ఉపాధ్యాయులు, ఆశా వర్కర్లు, గ్రామ పోలీసు అధికారి, పంచాయతి కార్యదర్శులు, ఎన్జీవో సిబ్బంది, కుల సంఘాల పెద్దల సమక్షంలో ఏర్పాటు చేశారు.

ఈ సందర్బంగా ఐసీడీఎస్ సూపర్ వైజర్ గౌసియా బేగం మాట్లాడుతూ.. బాలల హక్కులను బాల్య వివాహం నిర్మూలనకు ఈ కమిటీలు తోడ్పడుతాయని  తెలిపారు. గ్రామంలో 18 ఏళ్లలోపు పిల్లల రక్షణ, భద్రత, హక్కుల కోసం గ్రామ బాలల పరిరక్షణ కమిటీ ఏర్పాటు తప్పనిసరని తెలిపారు. ఈ కమిటీ బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, వేధింపులను అరికట్టడం, పిల్లల విద్య, ఆరోగ్య సంరక్షణను పర్యవేక్షిస్తుందని తెలిపారు.

అక్రమ దత్తత తీసుకుంటే కఠిన చర్యలు తప్పువని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నాగమ్మ, అంగన్వాడీ టీచర్లు రమణ, ధనలక్ష్మి, ఏఎన్ఎం సావిత్రి, త్రివేణి, ఆశా వర్కర్ సైదమ్మ, గ్రామ పెద్దలు సాంబయ్య, ఆంజనేయులు, చంద్రయ్య, మౌనిక, లావణ్య, రామయ్య తదితరులు పాల్గొన్నారు.  

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -