Saturday, March 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గాలికుంటు వ్యాధి నివారణ టీకాల పరిశీలన

గాలికుంటు వ్యాధి నివారణ టీకాల పరిశీలన

- Advertisement -

నవతెలంగాణ – తుంగతుర్తి
పాడి రైతులు తమ పశువులకు తప్పకుండా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని జిల్లా పశువైద్య సహాయ సంచాలకులు డాక్టర్ వెంకన్న అన్నారు. శనివారం తుంగతుర్తి సహాయ సంచాలకులు డాక్టర్ భయగాని రవి ప్రసాద్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని తనిఖీ చేసి మాట్లాడారు. పాడి రైతులు ఈ అవకాశాన్గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని పరిశీలించిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం కొనసాగుతున్న తీరు గురించి అడిగి తెలుసుకున్నారు.

ప్రభుత్వం సరఫరా చేసిన టీకా మందును ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు ప్రతి పశువుకు తప్పకుండా టీకా వేయించాలన్నారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి గాలికుంటు నివారణ టీకాలు వేయించడం ద్వారా పాడి పశువులు ఆరోగ్యంగా ఉంటాయని తెలిపారు. జీవాలు గాలికుంటు వ్యాధి బారిన పడడం వల్ల పాల ఉత్పత్తి తగ్గిపోవడం, కాలి డెక్కలలో పగుళ్లు ఏర్పడి నడవలేకపోవడం, నోటి నుండి చొంగ కారడం, చూడి పశువులకు అబార్షన్లు అవ్వడం వంటి లక్షణాలు కనిపిస్తాయన్నారు.

రైతులు ముందు జాగ్రత్త కొరకు తప్పకుండా తమ పశువులకు గాలికుంటు నివారణ టీకాలు చేయించుకోవాలని సూచించారు. రైతులకు పలు సలహాలు సూచనలు చేశారు. గ్రామంలో ఇప్పటివరకు 1000 పశువులకు గాను 802 పశువులకు టీకాలు ఇవ్వడం జరిగిందని, మిగిలిన రైతులందరికీ కూడా సమాచారం అందజేసి టీకాలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెటర్నరీ అసిస్టెంట్ రవి గోపాలమిత్రలు లింగయ్య, శ్రీను, గణేష్ గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -