Saturday, March 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అక్రమ ఇసుకను వేలం వేసిన తహశీల్దార్

అక్రమ ఇసుకను వేలం వేసిన తహశీల్దార్

- Advertisement -

నవతెలంగాణ – దర్పల్లి
మండలంలోని హోన్నజీపేట, కోటాలపల్లి గ్రామాల్లోని అక్రమ ఇసుక డంపులను తహసీల్దార్ శాంత, పోలీసులు సంయుక్త దాడులు చేసి దంపులను సీజ్ చేసి గతనెల కలెక్టర్ కు నివేదికలు అందించారు. దీంతో స్పందించిన కలెక్టర్ వేలం వేయాలని ఆదేశాలు రావడంతో శనివారం ఆ డంపులను తహసీల్దార్ శాంత తమ కార్యాలయంలో ఇసుక  వేలం కార్యక్రమము నిర్వహించినట్లు తెలిపారు.

ఈ డంపులను హోన్నజీపేట గ్రామములోని డంపునకు రూ.1 లక్ష 30 వేల 1 వందకు చివరి పాటలో హోన్నజీపేట గ్రామనికి చెందిన సురేందర్ రెడ్డి కైవసం చేసుకున్నారు. కోటాలపల్లి డంపునకు రూ.70 వేల 5 వందలకు చివరి పాటలో భూక్యా బికయ్య చేజిక్కుంచుకున్నారు. ఈ కార్యక్రమములో ఆయా గ్రామాల నుండి వేలం పాటలో పాల్గొనేందుకు వచ్చిన వారితోపాటు, డీటీ ప్రవీణ్ కుమార్ ఆర్ఐ రాజేశ్వర్, జీపీఓలు నిరడి రాజారం, గంగాధర్, తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -