Saturday, March 28, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంగ‌ల్ప్ దేశాలు యూఎస్-ఇజ్రాయిల్‌ల‌కు స‌హ‌క‌రించొద్దు: ఇరాన్ అధ్య‌క్షుడు

గ‌ల్ప్ దేశాలు యూఎస్-ఇజ్రాయిల్‌ల‌కు స‌హ‌క‌రించొద్దు: ఇరాన్ అధ్య‌క్షుడు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ప‌శ్చిమాసియా యుద్ధం నేప‌థ్యంలో ఇరాన్ అధ్య‌క్షుడు మసూద్ పెజెష్కియన్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇరాన్‌పై దాడుల‌కు పాల్ప‌డుతున్నా ఇజ్రాయిల్-అమెరికా దేశాల‌కు గ‌ల్ప్ దేశాలు స‌హ‌క‌రించొద్ద‌ని, దేశంలో అభివృద్ధి, భద్రతను నిర్ధారించుకోవాలనుకుంటే గ‌ల్ప్‌ భూభాగాలను యుద్ధానికి ఉపయోగించుకోవడానికి అనుమతించవద్దని ఆయ‌న డిమాండ్ చేశారు.

‘‘టెహ్రాన్ మౌలిక సదుపాయాలు లేదా ఆర్థిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటే అమెరికా-ఇజ్రాయెల్‌పై ఇరాన్ తీవ్రంగా ప్రతీకారం తీర్చుకుంటుందని ఆయన పునరుద్ఘాటించారు. “ఇరాన్ ముందస్తు దాడులు చేయదని మేము చాలాసార్లు చెప్పాము, కానీ మా మౌలిక సదుపాయాలు లేదా ఆర్థిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటే మేము తీవ్రంగా ప్రతీకారం తీర్చుకుంటాము,” అని పెజెష్కియన్ Xలో ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -