Saturday, March 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా 3వ మహాసభలను జయప్రదం చేయండి

వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా 3వ మహాసభలను జయప్రదం చేయండి

- Advertisement -

నవతెలంగాణ – అచ్చంపేట
ఈనెల 30వ తారీఖున చారగొండ మండలంలో నిర్వహిస్తున్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మూడవ మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మల్లేష్ పిలుపునిచ్చారు. శనివారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో అమ్రాబాద్ మండలం ఏమిరెడ్డి పల్లి గ్రామంలో ఉపాధిహామీ కూలీలు పనిచేస్తున్న పని ప్రదేశాలను సందర్శించారు. కూలీలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్. మల్లేష్ మాట్లాడారు కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టని రద్దుచేసి వి బి జి రాంజీ బిల్లును తేవడం కూలీలా  నోట్లో మట్టి కొట్టినట్లేనని అన్నారు. వెంటనే ఈ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మూడు వారాల నుండి కూలీలు పనిచేస్తున్న ఇంతవరకు డబ్బులు రాలేదని కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు చెల్లించాలని అన్నారు. ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు చెల్లించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కూలీలు బాలకృష్ణయ్య,  తిరుపతమ్మ, చిన్నమ్మ, సువర్ణ, రాములమ్మ,  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -