నవతెలంగాణ-ఆమనగల్
ఆమనగల్ పట్టణంలో శనివారం సాయంత్రం శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు బైకు ఢీకొని యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని చెన్నకేశవ కాలనీకి చెందిన ట్రాక్టర్ మెకానిక్ పల్లపు చరణ్ (20) తన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపు సమీపంలో హైదరాబాద్ వైపు నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు, ద్విచక్రవాహనం బలంగా ఢికొన్నాయి. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలకు గురైన చరణ్ అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.




