Sunday, March 29, 2026
E-PAPER
Homeసినిమాజ్ఞాపకాల కోసమే కాదు..

జ్ఞాపకాల కోసమే కాదు..

- Advertisement -

ఎమర్జింగ్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ రాధాకృష్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, విదేశాల్లో అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో బ్లాక్‌బస్టర్‌ సినిమాలను విజయవంతంగా డిస్ట్రిబ్యూట్‌ చేసి తనదైన గుర్తింపు తెచ్చుకున్న సంస్థ రాధాకృష్ణ ప్రొడక్షన్‌ హౌస్‌ ఇప్పుడు కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘డాన్‌ బోస్కో’ సినిమాను రూపొందిస్తోంది. వెంకట్‌ ఉప్పుటూరి నిర్మాత. రుష్య దత్త ఈ సినిమాలో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుంది. ‘జైలర్‌, నా సామి రంగ’ సినిమాలతో గుర్తింపు పొందిన మిర్నా మీనన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. శనివారం మేకర్స్‌ ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌తో పాటు ఒక ముఖ్యమైన అప్‌డేట్‌ను విడుదల చేశారు.

‘ప్రతి రీయూనియన్‌ జ్ఞాపకాల కోసమే కాదు.. కొన్ని విముక్తి (రిడెంప్షన్‌) కోసం కూడా ఉంటాయి’ అనే క్యాప్షన్‌ మరింత ఎగ్జైట్‌మెంట్‌ను క్రియేట్‌ చేస్తున్నాయి. ఇందులో మురళీ శర్మ ప్రిన్సిపాల్‌ విశ్వనాథ్‌ పాత్రలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మిర్నా మీనన్‌ లెక్చరర్‌ సుమతి పాత్రలో కనిపించనుంది. మౌనిక, రాజ్‌కుమార్‌ కాసిరెడ్డి, విష్ణు ఓయ్ తదితరులు కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కచ్చితంగా ఈ మూవీ మంచి ఎంటర్‌టైనర్‌గా మెప్పిస్తుందని మేకర్స్‌ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: పి.శంకర్‌ గౌరి, మ్యూజిక్‌:చరణ్‌ పాకాల, సినిమాటోగ్రఫీ: ఎదురోలు రాజు, ఎడిటర్‌: వంశీ అట్లూరి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -