Sunday, March 29, 2026
E-PAPER
Homeసోపతియుద్ధం ఓ అనర్ధం

యుద్ధం ఓ అనర్ధం

- Advertisement -

అహంకారంతో ఇతర దేశాల సార్వభౌమత్వంపై
పెత్తనం
లొంగని వారి శవంతో
పొందుతున్న పైశాచికత్వం
ప్రపంచ దేశాలలో పట్టు కొరకు
ఒకరు చేస్తున్న యుద్ధం
ప్రతీకారంతో మరొకరు చేస్తున్న
యుద్ధం
పసిపిల్లలతో పాటు ఎందరో
అమాయకుల ప్రాణాలను బలిగొట్టున్న
యుద్ధం
సామ్రాజ్యవాద సవాలుకు ప్రతి సవాల్‌
ఈ యుద్ధం
భవిష్యత్‌ ను అంధకారంలో
ముంచుతున్న యుద్ధం
రానున్న రోజుల్లో ఆర్థిక సంక్షోభానికి
దారితీస్తున్న యుద్ధం
ఈ యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి
నాంది పలుకబోతున్న యుద్ధమెమో
యుద్ధం ఆపడానికి జరగాలి
చర్చ
దానికి స్పందించాలి మనమంతా
ఈ యుద్ధం ఓ అనర్థం
ఈ యుద్ధం ఓ అనర్థం
అక్షరజ్వాల, 9010483021

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -