Sunday, March 29, 2026
E-PAPER
Homeకవర్ స్టోరీఆటిజంతో తడబడుత్నున్న బాల్యం

ఆటిజంతో తడబడుత్నున్న బాల్యం

- Advertisement -

జయ వాళ్ల ఇంటికి స్నేహితులు వచ్చారు. వాళ్ల పిల్లలు దీప, ధీరజ్‌ లు జయ వాళ్ల పాప సోనుతో ఆడుకోవాలను కొన్నారు. కాని సోను తన బొమ్మలను ముట్టకోనివ్వలేదు. వాళ్లని పట్టించుకోకుండా ఒక్కతే ఆడుకుంటూ కూర్చుంది. అది చూసిన జయ, వేరే బొమ్మలు ఇస్తానంటూ, దీప, ధీరజ్‌ లను పిలిచింది. పిల్లలకి, పెద్దలకి సోను ప్రవర్తన కొంచెం వేరుగా అనిపించింది. జయకి కూడా అర్థమైంది. సోను మానసికంగా వయసుకు తగ్గట్లు ప్రవర్తించటం లేదని. కాని, అది వ్యాధి లేక రుగ్మత గా భావించడానికిగాని, పిల్లల వైద్యులను సంప్రదించటానికి గాని ఇష్టపడడం లేదు. సోనూకి మూడేళ్లు నిండుతున్నాయి. ‘ప్లే స్కూల్‌ ‘ లో చేర్పించాలనుకుంటోంది. అంతకు ముందు డాక్టర్‌ దగ్గరికి తీసుకెళ్లి, పిల్లలో ఏదైనా లోపం ఉందేమో నని కనుక్కోవాలని సోను వాళ్ల నాన్న గిరి అనుకున్నాడు. తెలిసిన ‘న్యూరాలజిస్ట్‌’ రమ్యని సంప్రదించాడు. సోను ని పరీక్షించి,సోనుకి ఆటిజం. అంటే నాడీ సంబంధిత రుగ్మత (న్యూరోలాజికల్‌ డిజార్డర్‌) అని చెప్పింది. అది విన్న జయ, గిరి లకు ఒక్కసారిగా,తెలియని భయం, దుఃఖం వచ్చాయి. వాటిని దిగమింగుకొని’ఆటిజం’ అనేది ప్రమాదకరమైన వ్యాధా, ఏదైనా ఆపరేషన్‌ తో సరి చేయచ్చా, సోను మామూలు పిల్లల లాగా ఉండగలదా అంటూ అనేక సందేహాలను వెలిబుచ్చారు.

పిల్లల మెదడులోని కొంతభాగం సరిగా పనిచేయకపోవటం వల్ల వారు మామూలు పిల్లలలాగా ప్రవర్తించలేకపోవడాన్నే ఆటిజం సమస్యగా చెప్పుకోవాలి. ఈ సమస్యకి అనేక కారణాలు ఉన్నాయి. కొన్ని జన్యుపరమైనవి. మెదడు ఎదుగుదలకు తోడ్పడే జన్యువులు, అందులో స్రవించే సెరటోనిన్‌, డోపమిన్‌ వంటి రసాయనాలు తగినంత విడుదల కాకపోవటం కూడా ఒక ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. గర్భధారణ సమయంలో ఇన్ఫెక్షన్లు, తీవ్రమైన ఉద్వేగాలకు లోనైనా శిశువు పెరుగుదల పై అది ప్రభావం చూపిస్తుంది. నెలల నిండా కుండా పుట్టిన బిడ్డలలో కూడా ఈ సమస్యను గమనించవచ్చు. తల్లిదండ్రులిద్దరు ఉద్యోగాలు చేయడంతో వారి ఉరుకులపరుగుల జీవితంలో పిల్లలకు తగినంత నాణ్యమైన సమయాన్ని ఇవ్వలేకపోతున్నారు.దాని వల్ల పిల్లలు మానసికంగా ఎదగలేరు.అది కూడా ఆటిజం సమస్యకు దారితీస్తోంది.దీనికి తోడు పర్యావరణవరణానికి సంబంధించిన కారకాలు కూడా ఆటిజంకు కారణమవుతున్నాయని శాస్త్రీయ అంచనాలు తెలుపుతున్నాయి.అసలు ఆటిజం సమస్యనుఎలా గుర్తించవచ్చో తెలుసుకుందాం.



– పిల్లలు తమ పేరుకు స్పందించక పోవడం
– తోటిపిల్లలతో కలవడానికి ఇష్టపడక పోవడం
– నేరుగా కళ్లలోకి చూడలేక పోవడం.
– శబ్దాలకు స్పందించక పోవడం
– ఒంటరిగా ఆడుకోవడం, తమ వస్తువులను, బొమ్మలనుఎవరితోనూ పంచుకోవడానికి ఇష్టపడకపోవడం
-.హైపర్‌ ఆక్టివిటీ. కాంతి, ధ్వని, రుచి, వాసన వంటి వాటికి అసలు స్పందించక పోవటం. లేక అతిగా స్పందించటం.
– అప్పుడప్పుడు తమ చేతిలోని వస్తువు విసిరితే, ఎదుటి వారికి దెబ్బతగులుతుందనే స్పహ లేకుండాప్రవర్తించటం.
మనం ఆటిజం వ్యాధి లక్షణాలు ఎన్ని చెప్పుకున్నా, వాటికి భిన్నంగా కూడా ప్రవర్తిస్తుంటారు. ప్రతి వ్యక్తి వేలి ముద్రలు ఎలా భిన్నంగా ఉంటాయో అలాగే ఈ ఆటిజం లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా ఉంటాయి. అలా ప్రవర్తించటానికి నిర్ధిష్ట కారణం కనబడదు. అయితే 1940ల నుండి ఈ వ్యాధిని గుర్తించినా, 1980లవరకు అంతగా వారి సంఖ్య పెరగలేదు. ఏ రంగంలో అయినాఅభివద్ధి అనేది రెండువేపులా పదును ఉన్న కత్తి లాంటిదని చెప్పకోవచ్చు. మానవుడు విద్య, వైద్య, శాస్త్ర, సాంకేతిక రంగాలలో ఎంత పురోగమించినా వాటిని సవాల్‌ చేసే కొత్త, కొత్తసమస్యలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. అనేక రంగాలలో అభివద్ధే, వివిధ కాలుష్యాలకు కారణమవుతోంది. ముఖ్యంగా యువతధనార్జన వెంటపడి టైం ప్రకారం తిండి, నిద్రలకు దూరం అవుతోంది. లక్ష్యసాధన కోసం ఆరోగ్యాలను పణంగా పెడుతున్నారు. కుటుంబానికి, ఉద్యోగానికి మధ్య శ్రమ విభజన, సమయపాలన చేయలేకపోతున్నారు. వివాహ వయస్సుతో పాటు పిల్లలను కనే వయసు కూడా పెరుగుతోంది. ముఫ్పైల తరువాత పిల్లలు కంటే వారిలో అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నట్లు గణాంకాల ద్వారా తెలుస్తోంది. వాటిలో ముందు వరుసలో ఉన్నది ఆటిజమ్‌ అని చెప్పాల్సి వస్తోంది. ఈ సమస్యని ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిల్లలలో చూడవచ్చు.ఇదివరకు వందమందిలో ఒకరిలో మాత్రమే ఈ రుగ్మత కనిపించేది. క్రమంగా అంది ప్రతి 68మంది శిశువులలో ఒకరు ఈ ఆటిజం బారిన పడుతున్నారని ‘యునైటెడ్‌ నేషన్స్‌ అసెంబ్లీ గుర్తించింది.ఈ నిష్పత్తి రానున్న కాలంలో తగ్గే ప్రమాదం కూడా పొంచి ఉంది. అందుకే సమాజంలో ఈ రుగ్మత గురించి తెలియజేస్తూ, తీసుకోవలసిన జాగ్రత్తల పై అవగాహనను పెంచడానికి, 2007 నుండి ఏప్రిల్‌ 2వ తారీకును world Autism Awareness day (WAAD) గా ప్రకటించింది.
ఆటిజం రావడానికి కారణాలు వైద్యశాస్త్రానికి కూడా అంతు చిక్కడం లేదు. పరిశీలనలు, పరిశోధనలు జరగాల్సి ఉంది. అలాగే ఆటిజం బారిన పడే పిల్లలను కూడా గుర్తించలేక పోతున్నాము. సమస్య తీవ్రమైన తరవాత తెలుసుకోవడం వల్ల దాని నివారణ కష్టమవుతోంది. ఆటిజం ను అరికట్టడానికి తల్లిదండ్రులతో పాటు, సమాజం, ఉపాధ్యాయులు, వైద్యులు అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సి ఉంటుంది.



ఆటిజంను అధిగమించే మార్గాలు :-
1. పుట్టబోయే శిశువు ఆరోగ్యం కోసం ప్రతి తల్లి ఆరోగ్య పరీక్షలను చేయించుకోవాలి.
2. గర్భస్త శిశువు కదలికలలో తేడా అనిపిస్తే, వెంటనే డాక్టరును సంప్రదించాలి.
3. గర్బిణులు మంచి పౌష్టికాహారంతో పాటు ఒత్తిడిని తగ్గించుకోవాలి. వ్యాయామం చేయాలి.4.ధూమపానం, ఆల్కహాల్‌, డ్రగ్స్‌ వంటి వాటికి దూరంగా ఉండాలి.5.సప్లిమెంట్లను డాక్టర్‌ సలహాపై వాడాలి.6.వాయుకాలుష్యం లేకుండా చూసుకోవాలి.
అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లల ఎదుగుదలకు సరైన జాగ్రత్తలు తీసుకోవాలి.
శిశువుకి ఆరునెలలు వచ్చే వరకు తల్లిపాలను ఇవ్వాలి. తరువాత కార్బోహైడ్రేట్స్‌, ప్రొటీన్‌, విటమిన్లు, ఖనిజన్లు, ఫైబర్‌ ఉన్న సమతులాహారాన్ని అందించాలి. అన్నిటికన్నా ముఖ్యమైనది శిశువు ఎదుగుదలను గమనించడం. అంటే నెలల వయసులో పాకడం, నవ్వడం, తరువాత శబ్దాలను మాటలుగా మార్చే ప్రయత్నం, పిలుపుకి బదులివ్వడం, నడవడానికి ప్రయత్నం చేస్తున్నాడా లేదా అనేది గమనించాలి. అలా కాక వయసుకు తగ్గ మానసిక పరిపక్వత లేకపోవడం, ఎలాంటి అనుభూతి తెలపకపోవడం, గాయాలు తగిలినా తెలుసుకోలేకపోవడం, అకారణంగా ఏడుస్తూ ఉండడం లాంటి లక్షణాలు కనిపిస్తే డాక్టర్‌ ని సంప్రదించాలి. ఎంత చిన్న వయసులో కనుగొంటే అంత మేలైన చికిత్స, సహాయం చేయవచ్చు.సమిష్టి కషితో ఆటిజం బాధితులు కూడా స్వతంత్రంగా, గౌరవంగా జీవించే వాతావరణాన్ని కల్పించడం దేశప్రగతిలో భాగం. ఆటిజం బాధితులకి వారి సమస్యలను అధిగమించడానికి రకరకాల థెరపీలు అవసరమవుతాయి. స్పీచ్‌ మరియు లాంగ్వేజ్‌ థెరపీ, స్వీయ సంరక్షణ, వ్యక్తిగత విద్య ప్రణాళికలు, మెరుగైనసామాజిక సంబంధాల కోసం ఆయా రంగాలలో నిపుణులైన వైద్యుల సలహా, సహాయాలను తీసుకోవాలి. దీనితో పాటు సమాజం కూడా ఆటిజం ఉన్న పిల్లలను అంగీకరించాలి. వారి ప్రవర్తనలోని వ్యత్యాసాన్ని గౌరవించాలి. ఈ ఆటిజం బారిన పడడానికి లింగ భేదం లేదు. దీని వల్లపిల్లల మానసిక, శారీరిక అభివద్ధి కుంటుపడుతుంది.అందుకే 2016 దివ్యాంగుల చట్టం ప్రకారం వీరికి విద్య, ఉద్యోగ రంగాల్లో కొన్ని వెసులుబాటులు కల్పించబడ్డాయి. అంతేకాక ఆర్థికస్థోమత లేని కుటుంబాలకు ఉచితంగా థెరపీలు అందజేసేలా వ్యవస్థను బలోపేతం చేయాలి. ప్రతి సంవత్సరం ఒక థీమ్‌ తో ఆటిజం దినోత్సవాన్ని జరుపుతారు.ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆటిజంతో సవాళ్లను ఎదుర్కొంటున్న వారికి సహానుభూతి అందించటానికి సుమారు 100దేశాలు 40వేల మంది డాక్టర్లు, ఆక్యుపేషనల్‌ థెరపిస్ట్‌ లుస్విర్జర్లాండ్ల్‌ లో ఏప్రిల్‌ 2న జరగబోయే సమావేశంలోపాల్గొంటున్నారు. చైల్డ్‌ సైక్రియాటిస్ట్‌ లు, నియోనాటాలజిస్ట్‌ లు ఆటిజం నివారణ, అవగాహన, పరిశోధనల అవసరాలను చర్చిస్తారు. పరిశోధనా పత్రాలను సమర్పిస్తారు.చాలాసార్లు ఆటిజం సమస్య కన్నా పెద్దది సాటి వారు వాళ్లని చూసే తీరు అని చెప్పవచ్చు. వాళ్లు ప్రత్యేకమైనవారని, వారు వారి స్వంత వేగంతో అభివద్ధి చెందుతారని గ్రహించాలి. అదే వారికి కావలసిన అసలైన థెరపీ.
» do not suffer fromAutism. But I do suffer from
The way you treat meμμ.—Tylor Durdin


గ్రీకు పదం ఆటోస్‌ (స్వీయ) నుండి ఆటిజం అనే పదాన్ని గ్రహించారు. ఆటిజం ప్రధానంగా మెదడులోని సమాచార ప్రసారప్రక్రియను ప్రభావితం చేయడం వల్ల, పిల్లల అభివద్ధిలో మార్పులు, వ్యత్యాసాలు చోటుచేసుకుంటాయి. ఈ ఆటిజం లక్షణాలు అందరిలో ఒకే రకంగా ఉండవు. దాని వల్ల, వారికి అందించే చికిత్స కూడా ఒకే విధంగా ఉండదు. అందుకే ఆటిజమ్‌ ను స్పెక్ట్రమ్‌ డిజార్డర్‌ గా పేర్కొంటారు. ఆటిజంను బాల్య విచ్ఛిన్న రుగ్మతగా భావించవచ్చు. ఇది ప్రధానంగా నాలుగు రకాలుగాకనిపిస్తుంది.

1. ఆటిస్టిక్‌ డిజార్డర్‌:- భాషని, భావాన్ని సరిగా వ్యక్తీకరించలేరు. నలుగురితో కలవడానికి ఇష్టపడరు. చేసిన పనినే మళ్లీ మళ్లీ చేస్తుంటారు. మార్పును స్వీకరించలేరు. ఇది ఎక్కువగా మగపిల్లలలో కనిపిస్తుంది.
2. రెట్స్‌ డిజార్డర్‌:- శారీరక ఎదుగుదల తక్కువగా ఉంటుంది. నడుమును సరిగా నిలపలేరు. ఫిట్స్‌ కూడా వస్తుంటాయి. ఇది ఎక్కువగా ఆడపిల్లలలో కనిపిస్తుంది.
3. ఆస్పర్జస్‌ డిజార్డర్‌:- కొంతమంది పిల్లలు కొన్ని విషయాలలో ఎక్కవ తెలివితేటలను, గొప్ప నైపుణ్యాలను ప్రదర్శిస్తుంటారు. కొంతమంది గణితంలోలేక సంగీతంలోనో, మరికొందరు చిత్రలేఖనంలో విశేష ప్రతిభ చూపిస్తారు. కాని వీరు అతి కోపాన్ని ప్రదర్శిస్తుంటారు.
4. చైల్డ్‌ హుడ్‌ డిసింటిగ్రేటెడ్‌ డిజార్డర్‌:- ఇది ప్రమాదకరమైన రుగ్మతగా చెప్పవచ్చు. ఈ రుగ్మత ఉన్న పిల్లలు దాదాపు రెండేళ్ల వరకుమామూలుగానే కనిపిస్తారు. ఆ తరువాత ఎదుగుదల వెనక్కి (రిగ్రేషన్‌) వేగంగా జరుగుతుంది. ముందుగా ముఖం రఫ్‌ గా మారుతుంది. అలాగే శరీరమంతా ముడతలతో వద్ధాప్యఛాయలను చూపిస్తాయి. నాడీ సంబంధ లోపాలతో, ఫిట్స్‌ తో మంచానికే పరిమితమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది.

డా.నీరజ అమరవాది, 9849160055

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -