పాలు ప్రాణావసరమా? లేక కేవలం ఒక అలవాటేనా? పాలు మనకు అవసరమా? లేక అది మన రోజువారీ జీవితంలో కేవలం ఒక అలవాటు మాత్రమేనా? పాలు ఎందుకు మనకు అవసరమో లేదా ఎందుకు కాదో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మన శరీరానికి పాలు ఎంత అవసరమో లేదా అది ఒక అలవాటు మాత్రమేనా అని తెలుసుకుందాం.
పాలు మనకు పుట్టుకతో వచ్చిన అనుబంధం. అమ్మ పాలతో మనం పెరుగుతాం. పెద్దయ్యాక కూడా పాలు మన రోజువారీ జీవితంలో ఉంటాయి. పాలు తాగితే బలం వస్తుందని, పాలు లేకపోతే మనం పెరగమని మన పెద్దలు చెబుతుంటారు. కానీ, ఇప్పుడు శాస్త్రవేత్తలు పాల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెబుతున్నారు. పాలు మన శరీరానికి కొంత మేలు చేస్తాయని నిజం. కానీ పాలు లేకుండా కూడా ఆరోగ్యంగా ఉండవచ్చు. పాలు మనకు కావాల్సిన కాల్షియం, ప్రోటీన్లు, విటమిన్లు ఇస్తాయని అనుకోవడం తప్పు. రాగులు, నువ్వులు, ఆకుకూరలు, శెనగలు, రాజ్మా, పప్పు దినుసుల్లో పాలు కంటే ఎక్కువ పోషకాలు ఉన్నాయి. ప్రపంచంలో కోట్ల మంది పాలు తాగకుండా ఆరోగ్యంగా జీవిస్తున్నారు.
పాలు తాగితేనే బుద్ధి పెరుగుతుంది, ఎముకలు గట్టిగా తయారవుతాయి! చిన్నప్పటి నుంచి మనందరి ఇళ్లలోనూ వినిపించే మాటలివి. నిజానికి పాలల్లో కాల్షియం, ప్రోటీన్లు ఉంటాయన్నది ఎంత నిజమో, ఆ పోషకాలు కేవలం పాల వల్లే లభిస్తాయనుకోవడం మాత్రం అంతే పెద్ద అపోహ. మన మెదడులో బలంగా నాటుకుపోయిన ఈ ఆలోచనల వెనుక శాస్త్రీయత కంటే కూడా సామాజిక అలవాట్లు, వ్యాపార ప్రకటనల ప్రభావమే ఎక్కువగా ఉంది. మనం పాలు తాగనవసరం లేదు. పాలు తాగకుండానే మనకు కావలసిన పోషకాలను ఇతర ఆహారాల నుండి పొందవచ్చు. ఉదాహరణకు
కాల్షియం: మనం తాగే పాల కంటే రాగి జావ, నువ్వులు, ఆకుకూరల్లో ఇది అత్యధికంగా లభిస్తుంది.
ప్రోటీన్: పప్పు ధాన్యాలు, సోయా వంటి వాటిలో ప్రోటీన్ శాతం చాలా ఎక్కువ.
పాలు ఎందుకు అంత ముఖ్యమో ఆలోచించండి. పాలు మన సంస్కతిలో పవిత్రమైన ఆహారంగా భావించబడుతున్నాయి. కానీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ మనకు ఆరోగ్యంగా ఉండాలంటే, ఒకే ఆహారంపై ఆధారపడకూడదని చెబుతోంది. వైవిధ్యమైన ఆహారం మనల్ని బలంగా ఉంచుతుంది. పాలు తాగడం అనేది వ్యక్తిగత అభిరుచి మాత్రమే. అది ఆరోగ్యానికి ఏకైక మార్గం కాదు. మనం గమనించాల్సిన ఆసక్తికరమైన విషయం ఇది.
ప్రపంచంలో దాదాపు 65 నుండి 70 శాతం మందికి పాలను జీర్ణించే శక్తి ఉండదు. దీనిని వైద్యపరంగా ‘లాక్టోస్ ఇంటాలరెన్స్’ అంటారు. ప్రత్యేకించి ఆసియా, ఆఫ్రికా దేశాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. పాలు తాగినప్పుడు కడుపు నొప్పి లేదా గ్యాస్ ఏర్పడితే, అది ఏదో అనారోగ్యం అని భయపడాల్సిన అవసరం లేదు. అది కేవలం మీ శరీరం పాలను స్వీకరించలేకపోవడం వల్ల వచ్చే సహజ సంకేతం.
పాలు అరగకపోవడం మన జన్యువులలోనే ఉంది. పాలు అరగకపోవడం ఒక బలహీనత కాదు. ఇది మన శరీరతత్వంలోని వైవిధ్యం. మన శరీరానికి ఏది పడుతుందో, ఏది పడదో గుర్తించి దానికి తగ్గట్టుగా ఆహార అలవాట్లను మార్చుకోవడం ఆరోగ్యం. పాలు అరగకపోవడం అనేది మన జన్యువులలోని ఒక భాగం. పాలు అరగకపోవడం గురించి మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మన శరీరానికి ఏది పడుతుందో గుర్తించడం, దానికి తగ్గట్టుగా ఆహార అలవాట్లను మార్చుకోవడం మంచిది. పాలు మరియు పాల ఉత్పత్తుల ప్రాముఖ్యతను పక్కనపెట్టి, ప్రస్తుతం మనం తాగుతున్న పాలు ఎంతవరకు సురక్షితమో అనే ప్రశ్న అందరినీ ఆందోళన చెందుతుంది. ముఖ్యంగా మన దేశంలో పాల కల్తీ ఒక పెద్ద సమస్యగా మారింది. భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల ప్రాధికార సంస్థ చేసిన పరిశోధనలు చూస్తే, అసలు విషయాలు బయటపడుతున్నాయి.
గతంలో జరిగిన ఒక విస్తత సర్వేలో, వేల సంఖ్యలో సేకరించిన నమూనాల్లో ప్రమాదకరమైన కల్తీలు మాత్రమే కాకుండా, అంతకు మించిన ముప్పులు పొంచి ఉన్నాయని తేలింది. సుమారు 5.7 శాతం నమూనాల్లో ‘అఫ్లాటాక్సిన్ వీ1’ వంటి క్యాన్సర్ కారక కలుషితాలు, మరికొన్నింటిలో మోతాదుకు మించిన యాంటీబయాటిక్స్ ఉన్నట్లు గుర్తించారు. ఇవి తక్షణమే ప్రభావం చూపకపోయినా, దీర్ఘకాలంలో మన ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి.
ప్రభుత్వం నిబంధనలను కఠినం చేస్తోంది. తనిఖీలను పెంచుతోంది. ఇప్పటికీ ఈ సమస్య పూర్తిగా అదుపు లోకి రాలేది. ఇది నాణ్యత సమస్య మాత్రమే కాదు. ప్రజల ఆరోగ్యంతో ముడిపడి ఉంది. మనం తాగే పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎంతవరకు నమ్మదగినవి? అని చూడాల్సిన బాధ్యత ఇప్పుడు మనందరి మీద ఉంది.
పాల దిగుబడిని పెంచడానికి పశువులకు ఇచ్చే ‘ఆక్సిటోసిన్’ ఇంజక్షన్లు డైరీ రంగంలో ఒక సమస్యగా మారాయి. ఈ ఇంజక్షన్లు పశువులకు చాలా బాధను కలిగిస్తాయి. ఇవి వాటి పునరుత్పత్తి వ్యవస్థను దెబ్బతీస్తాయి మరియు వాటి ఆయుర్దాయాన్ని తగ్గిస్తాయి. అందుకే ప్రభుత్వం ఈ హార్మోన్ను నిషేధించింది. కానీ మార్కెట్లో లో ఇప్పటికీ ఈ ఇంజెక్షన్లు దొరుకుతున్నాయి, ఇది ఆందోళన కలిగిస్తోంది. కానీ, ఈ హార్మోన్తో కలిపిన పాలు తాగితే మనకు హాని జరుగుతుందా? అనేది చాలా మంది ఆందోళన. శాస్త్రీయ పరిశోధనలు కొన్ని విషయాలను వెల్లడిస్తున్నాయి. పాల్లో ఉండే ఆక్సిటోసిన్ మన జీర్ణవ్యవస్థలోకి వెళ్లగానే వెంటనే విచ్ఛిన్నమైపోతుంది. అందువల్ల, ఇది మన రక్తంలోకి నేరుగా చేరదు. కాబట్టి, హార్మోన్ల అసమతుల్యత ఏర్పడటం లేదా పిల్లలు త్వరగా యుక్తవయస్సుకు రావడం వంటి సమస్యలు దీనివల్ల తలెత్తవని శాస్త్రవేత్తలు స్పష్టం చేయటం మనకు ఊరట కలిగించే విషయమే.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆహార భద్రత గురించి చేస్తున్న హెచ్చరికలు చాలా ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రతి సంవత్సరం, సుమారు 60 కోట్ల మంది ప్రజలు కలుషితమైన ఆహారం తినడం వల్ల అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇందులో దాదాపు 4 లక్షల 20 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. నాణ్యత లేని ఆహారం తినడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. అవి జీర్ణకోశ సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత వంటివి. ఇవి తక్షణమే వచ్చే సమస్యలే కాకుండా, దీర్ఘకాలంలో కూడా ప్రభావం చూపుతాయి. సోషల్ మీడియాలో వ్యాపించే కొన్ని వార్తలపై మనం జాగ్రత్త వహించాలి.
ఉదాహరణకు, పాలు లేదా కలుషిత ఆహారం వల్ల 87 శాతం మందికి క్యాన్సర్ వస్తుందని ఔనఉ ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు. ఇది తప్పుడు సమాచారం మాత్రమే. మన ఆరోగ్యం విషయంలో ముప్పు పెరుగుతుందన్నది వాస్తవం కానీ, ఇలాంటి అభూతకల్పనలను నమ్మి భయాందోళనలకు గురికాకూడదు. ప్రభుత్వం, ఆరోగ్య సంస్థలు ఇచ్చే శాస్త్రీయ సమాచారాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకుని మన ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి.
పాలు తాగితే ఎముకలు బలంగా ఉంటాయని మనకు తెలుసు. కానీ హార్వర్డ్ విశ్వవిద్యాలయం చేసిన ఒక అధ్యయనం ఈ విషయాన్ని ప్రశ్నిస్తోంది. ప్రపంచంలో పాలు ఎక్కువగా తాగే దేశాల్లో ఎముకలు విరగడం వంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయని ఆ అధ్యయనం చెబుతోంది. పాలు ఎక్కువగా తాగే ఆసియా, ఆఫ్రికా దేశాల్లో ఇలాంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బలమైన ఎముకలు ఉండాలంటే కేవలం కాల్షియం సరిపోదు. ఎముకల పుష్టికి మన శరీరానికి విటమిన్ ణ, విటమిన్ ఖ లు అవసరం. మనం నియమితంగా శారీరక వ్యాయామం చేయాలి. సహజ సూర్యరశ్మి కూడా మనకు అవసరం. పాలు తాగితే ఎముకలు బలంగా ఉంటాయని ఆశించడం కంటే, సమతుల్య జీవనశైలిని అనుసరించడం మంచిది. బలమైన ఎముకలకు పాలు ఒక్కటే సరిపోదు.
భారతీయుల భోజనంలో పెరుగుకు ఉన్న ప్రాధాన్యతే వేరు. ఘాటైన మసాలా కూరలు తిన్నా, కారంతో నాలిక మండుతున్నా చివర్లో ముద్ద పెరుగు పడగానే కడుపు చల్లబడుతుంది. జీర్ణక్రియకు తోడ్పడుతూ, మన భోజనాన్ని సంపూర్ణం చేయడంలో పెరుగు పాత్రను ఎవరూ కాదనలేరు. అయితే, ఇక్కడే మనం ఒక నిజాన్ని గుర్తుంచుకోవాలి.
మనం వాడే పాలు కల్తీవైనా లేదా యాంటీబయాటిక్స్ కలిసినవైనా అయితే. వాటి నుంచి తయారయ్యే పెరుగు, పన్నీర్, నెయ్యి వంటి ఉత్పత్తులు కూడా కచ్చితంగా కల్తీ. అంటే, పాలు సురక్షితం కానప్పుడు వాటి అనుబంధ పదార్థాల్లోనూ ముప్పు పొంచి ఉండే అవకాశం ఉంది. నిజానికి పెరుగు తినడం అనేది మన సంస్కతిలో భాగమైన ఒక ఆహారపు అలవాటు మాత్రమే. అది లేకపోతే ఏదో అయిపోతుందనో, మన జీవనానికే ఆధారం కోల్పోతామనో అనుకోవాల్సిన పనిలేదు. పాలు పడని వారు లేదా కల్తీ పట్ల భయం ఉన్నవారు పెరుగుకు బదులుగా మన శరీరానికి చలవనిచ్చే ఇతర సహజ సిద్ధమైన ప్రత్యామ్నాయాలను కూడా ఆలోచించవచ్చు.
చివరగా ఒక్క మాట పాలను పూర్తిగా మానివేయాలని దీని అర్థం కాదు. కానీ, పాలు లేకపోతే ఆరోగ్యం లేదనే అతిశయోక్తిని పక్కన పెట్టి, వాటిపై మనం అతిగా ఆధారపడటం ఖచ్చితం మానుకోవాలి. మన రోజువారీ భోజనంలో
రకరకాల పండ్లు, కూరగాయలు, తణధాన్యాలకు చోటిస్తూ క్రమంగా ఆధారపడటం తగ్గించుకోవాలి. ప్రభుత్వం తాజాగా జారీ చేసే ఆరోగ్య హెచ్చరికలు, శాస్త్రీయ పరిశోధనలు సైతం ఇదే విషయాన్ని నొక్కి చెబుతున్నాయి. పాలు తాగాలా వద్దా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. అయితే, ఆ నిర్ణయం తీసుకునే ముందు అది మీ శరీరానికి సరిపడుతుందా? మీరు తాగుతున్న పాలు స్వచ్ఛమైనవేనా? అని ఆలోచించి అడుగు వేయడం ముఖ్యం. విజ్ఞతతో కూడిన ఆహారపు అలవాట్లు అటు మన ఆరోగ్యానికే ముక్యమైనది.



