Sunday, March 29, 2026
E-PAPER
Homeసమీక్షఅద్భుత ప్రపంచంలోకి ఒక సాహిత్య యాత్ర

అద్భుత ప్రపంచంలోకి ఒక సాహిత్య యాత్ర

- Advertisement -

ఉదార హృదయులకు ఈ ప్రపంచమంతా ఒక కుటుంబం. దేశ విదేశాలలోని పర్యాటక ప్రదేశాలను సందర్శించి, రచయిత పొందిన అనుభవాలను పాఠకులతో పంచుకునే యాత్ర గ్రంథమే ‘అద్భుత ప్రపంచంలోకి మా ప్రయాణం’. ప్రకృతి సౌందర్యం చారిత్రక ప్రాధాన్యం, స్థానిక సంస్కృతి వంటి అంశాలను రచయిత ఆసక్తికరంగా వివరించారు.

రంగరాజు శ్యాంసుందర్‌ రావు… ప్రపంచంలో ఒకటైన తాజ్‌ మహల్‌ 1979 లోనే చూసానని, 1980లో హైదరాబాదు నుండి కాశ్మీర్‌ వరకు 20 రోజులు బస్సు ప్రయాణంలో ఎన్నో ప్రాంతాలు చూసారట.. అలా నేపాల్‌, మానస సరోవరం, యూరప్‌ దేశాలు, మనదేశంలోని ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మేఘాలయ, అరుణాచల్‌, ప్రదేశ్‌ నాగాలాండ్‌ ఇలా దేశ విదేశాలలో చూడ తగిన అన్ని యాత్రా స్థలాలను చూడడం, అందరూ చూడాలని కలలుగానే ముఖ్యంగా అమెరికాలో విపరీతమైన చలిని తట్టుకునే మరో మారు విహరించడం సాహస యాత్రనే…
అలా కాశ్మీర్‌ నుండి కన్యాకుమారి వరకు గంగాసాగర్‌ నుండి ముంబై వరకు ఎన్నెన్నో ప్రదేశాలు చూడడం, వాటి గురించి ప్రయాణ అనుభవాలకు అక్షర రూపం ఇవ్వడం ఈ అనుభవాలు యాత్రలు చేసే వారికి ఎంతో ఉపయోగపడతాయి. ప్రతి ప్రదేశాన్ని కేవలం పర్యాటక స్థలంగా కాకుండా అక్కడి సంస్కతి, జీవనశైలిని కూడా రచయిత మన ముందు ఉంచడం ఈ పుస్తకం ప్రత్యేకత!
రచయిత తన యాత్రను మొదటి, రెండవ అంటూ ఏ యాత్రా స్థలానికి దానికి ప్రత్యేకంగా విభజించి రాయడం ముందు ఆయా స్థలాలు దర్శించుకోవడానికి పోయే వారికి సులువుగా ఎక్కడ బస దొరుకుతుంది? ఎవరిని సంప్రదించాలి? అక్కడ ప్రత్యేకతలు ఏమిటీ? ప్రకతి దశ్యాలు ఎలా ఉంటాయనే ప్రతి సమాచారం తెలియజేశారు.
మనం బదరీ – కేదార్‌ నాథ్‌ యాత్రలలో చూసిన వేడినీటి సరస్సుల వంటివి (Hot springs) yellow Stone Park లో ఉన్నాయని, అవి అందంగా ఉన్నాయనే వర్ణనలు మనకు వాటిని చూడాలనే ఆతత కలుగుతుంది. అలాగే పర్వతాలు సహజసిద్ధంగా ఎలా తయారయ్యాయని గార్డెన్‌ ఆఫ్‌ గాడ్స్‌ (ఇసుక రాతి గుట్టలను) అధ్యాయంలో వివరిస్తూ… నీటి ఒత్తిడికి – గాలి ఒత్తిడికి పరిణామం చెందిన వాటి అందాలను చూసి, నేర్పరులైన శిల్పులు చెక్కారా? అనిపించిందని రాయడం రచయిత లోని భావకుడు బయటపడతాడు.
ఇలా భూటాన్‌, అండమాన్‌ నికోబార్‌, లడక్‌, భారతదేశ ఈశాన్య రాష్ట్రాల అందాలన్నీ, అక్కడి విశేషాలను కళ్ళకు కట్టినట్టు రాసిన ఈ పుస్తకం గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఇవన్నీ చదివిసమీక్ష రాయాలంటే చేయి తిరిగిన రచయితకే సాధ్యం…యాత్రలంటే ఇష్టమనే ఒకేఒక అర్హత ఈ సమీక్ష చేసేసాహసం నాచేత చేయించింది.
కొత్త ప్రదేశం చూపే ప్రతి దశ్యం, మనసుకు కొత్త భావాన్ని అందిస్తుంది. ఏదేమైనా నావలె యాత్రలంటే ఇష్ఠమున్న ప్రతి పాఠకుడికీ ఈ పుస్తకం ఒక గైడ్‌ వలె ఉపయోగపడుతుంది. కొత్త ప్రదేశాలను చూడాలి, వాటి గురించి తెలుసుకోవాలంటే ఇది ఆసక్తికరమైన ప్రయాణ సమాచారంలా ఉంటుంది. ఎందుకంటే రచయిత ఎన్నో పర్యాటక ప్రదేశాలు చూసి, పొందిన అనుభూతులను సరళమైన భాష, సహజమైన వర్ణన, ప్రత్యక్ష అనుభవంతో ఈ పుస్తకం రాసారు. అంతేకాదు భౌగోళిక వివరాలేకాక, అక్కడి సంస్కృతి, ప్రజలజీవన విధానం వంటి అంశాలను ఆసక్తికరంగా రాసారు. అందుకే ప్రయాణ వర్ణనే కాకుండా విజ్ఞానదాయకంగా ఉంది.
మొత్తానికి ప్రపంచ వైవిధ్యాన్ని చూపించే ఈ ‘అద్బుత ప్రపంచంలోకి మా ప్రయాణం’ అనే ఈ యాత్రా పుస్తకం పాఠకులను కొత్త ప్రపంచంలోనికి తీసుకుని వెళ్లే సాహిత్య యాత్ర. రచయిత శ్రీ శ్యాంసుందర్‌ రావు కలం నుండి మరిన్ని జనరంజక రచనలు రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ….
దేశం చూసిన వాడికి దృష్టి విస్తరిస్తుంది
లోకం తెలిసిన వాడికి లోచనం మెరుగౌతుంది.
– రంగరాజు పద్మజ, 9989758144

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -