Sunday, March 29, 2026
E-PAPER
Homeకవితమరణానందం

మరణానందం

- Advertisement -

వేదనా గోడల మధ్య
ఉక్కిరి బిక్కిరి అవుతున్న శ్వాస
దేహం నుంచి స్వేచ్ఛను కాంక్షిస్తుంది
కనురెప్పల వెనుక తచ్చాడుతున్న తడి
జీవితపు చివరి మజిలీలో సేదతీరుతోంది
బాధను చూస్తున్న హదయాలు
విముక్తికి ప్రార్థనా గీతమవుతున్నాయి
గౌరవంగా తెరిచిన మత్యు తలుపులు
కొన్ని తన్లలాటల చిక్కుముళ్లను
విప్పుకొని రెక్కలు తొడుక్కుంటాయి
ద్వారం ఎన్నో మార్గాలకు మూలం సుమా..
శూన్యపు ఆవాసంలో దీర్ఘనిద్ర
జననమైనా…మరణమైనా ఒక్కటే…
లేని చేతిని పట్టుకుని కాలం నిద్రించటం
చూస్తున్న గుండె మోయలేని బారం
గడియల్ని గుణించే గడియారం
ఏ చివరి సమయాన్ని ఆపదు
ఒకానొక సమయాన మనమే ఆగుతాం..
తెలియకుండానే ఆగిపోతాం…
చావుకూ బ్రతుక్కూ మధ్య నలిగే అనుబంధాల అంతరం
ఓ కారుణ్య మరణానికి జండా ఊపేస్తుంది
ఇంకిన దుఃఖపు నీడలో…
అనాయాస మరణం కూడా…
కొన్ని సార్లు ఆనందమే…కదా..!
(దేశంలో అనుమతి పొందిన మొదటి కారుణ్య మరణమైన ‘హరీశ్‌ రాణా’ కు నివాళిగా)
డా.కటుకోఝ్వల రమేష్‌, 9949083327

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -