Sunday, March 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కాంగ్రెస్ కృషి

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కాంగ్రెస్ కృషి

- Advertisement -

నవతెలంగాణ – మునిపల్లి
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ఎంతగానో కృషి చేస్తున్నదని రాయికోడు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మంతూరు సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని మేళాసంఘం గ్రామంలో ఆదివారంనాడు స్థానిక సర్పంచ్ లక్ష్మీ సంగమేశ్వర్ ఆధ్వర్యంలో చేపట్టదలచిన పది లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్డు మరియు డ్రైనేజీ నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కోట్లాది రూపాయల నిధులను వెచ్చించి గ్రామాలను అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నట్టు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ లక్ష్మీ సంగమేశ్వర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సతీష్ కుమార్, మండల పరిషత్ మాజీ అధ్యక్షులు రాంరెడ్డి, మండల యువజన కాంగ్రెస్ నాయకులు తాటిపల్లి ప్రదీప్ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ సంగమేశ్వర్, స్థానిక నాయకులు ఖ్యాతం రవీందర్, ఉపసర్పంచ్ అంజయ్య, పంచాయతీ కార్యదర్శి చింతలగట్టు వాణి, వార్డు సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -