- Advertisement -
నవతెలంగాణ-రాయికల్
పట్టణ ప్రజల సౌకర్యార్థం ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని రాయికల్ అంగడి బజార్ లో ఆదివారం చలివేంద్రాన్ని ప్రారంభించారు. జిల్లాలో పెరుగుతున్న అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులకు తాగునీటి సౌకర్యం కల్పించడంతో పాటు,బస్ స్టాండ్ వద్ద నీడ లేకపోవడంతో షేడ్ నెట్‌ను కూడా ఏర్పాటు చేశారు. దీంతో ప్రయాణికులు ఎండ నుంచి ఉపశమనం పొందుతున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ కె.రవీందర్, కమీషనర్ కె.నాగరాజు, సానిటరీ ఇన్‌స్పెక్టర్ ఎం.డి.ఫయాజ్, జవాన్ వినయ్, ఆటో యూనియన్ సభ్యులు, కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.
- Advertisement -



