- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలో మార్కెట్ యార్డులో సింగిల్ విండో ఆధ్వర్యంలో మద్దతు ధర శనగ పంట కొనుగోళ్లకు గ్రామాల వారీగా షెడ్యూల్ ప్రకటించినట్లు మద్నూర్ గ్రామ ఏఈఓ సౌమ్య తెలిపారు. శనగ కొనుగోళ్లు ఈనెల 30 నుండి ఏప్రిల్ 1 వరకు జరుగుతాయని ఆమె తెలిపారు. రైతులు తమ పంటను తీసుకువచ్చి మద్దతు ధరతో కొనుగోలు కేంద్రంలో అమ్ముకోవాలని వ్యవసాయ శాఖ ఏఈఓ తెలిపారు. మద్నూర్ మండలంలోని 27 గ్రామ శివారు రైతులు కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు తెలియజేశారు.
- Advertisement -



