ట్రాన్స్కో డి ఈ రఘు
నవతెలంగాణ – ఆర్మూర్
మహాత్మ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వచ్ఛ కార్యక్రమాలు అభినందనీయమని ట్రాన్స్కో డీఈ రఘు అన్నారు. పట్టణంలోని జిరాయత్ నగర్లో ఆదివారం ట్రాన్స్కో డీఈ కార్యాలయంలో మహాత్మ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రతి ఆదివారం ఒక గంట నినాదంతో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. ఈ సందర్భంగా ట్రాన్స్కో డీఈ కార్యలయంలో పెరిగిన పిచ్చి మొక్కలు, చెత్త చెదారాన్ని తొలగించారు.
స్వచ్చంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సుంకె శ్రీనివాస్ మాట్లాడుతూ 48 వారాలుగా ఈ స్వచ్ఛ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ట్రాన్స్కో కార్యాలయంలో నిర్వహించిన ఈ స్వచ్ఛ కార్యక్రమంలో ట్రాన్స్కో సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారన్నారు. ఇటువంటి స్వచ్ఛ కార్యక్రమాలను స్పూర్తిగా తీసుకొని యువత ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్కో ఏడీఈ కృష్ణ, ట్రాన్స్కో సిబ్బంది సంతోష్, లింగం, గంగాధర్, స్వచ్ఛంద సంస్థ సభ్యులు సుంకె నిశాంత్, బొగడమీది ప్రశాంత్, వేదశ్రీ రాజ్ కుమార్, జంగిడి బోజన్న, బాశెట్టి పెద్ద గంగారాం, బట్టు సుమన్, కుతాడి ఎల్లయ్య, రాహుల్ రాజ్, గణేష్, కృషి వర్ధన్, తదితరులు పాల్గొన్నారు.



