రూ.100 కోట్లతో బాసర ఆలయ పునర్నిర్మణానికి శంఖుస్థాపన
రూ.200 కోట్లతో ఇంటిగ్రెటెడ్ స్కూల్ కు భూమి పూజ
నవతెలంగాణ – ముధోల్
ఏప్రిల్ 6న ఉదయం 11 గంటలకు బాసరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నారని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ ఆదివారం ఒక్క ప్రకటనలో తెలిపారు. బాసర లో మాస్టర్ ప్లాన్ అమలు చేయడంతో పాటు, ఆలయ ఆలయపున నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని ఎమ్మెల్యే తెలియజేశారు. అలాగే ముధోల్ లో రూ.200 కోట్ల తో ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమాన్ని బాసరలోనే చేపడతారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గ ప్రభుత్వ హాయంలో నిధులు మంజూరై అప్పటి పాలకుల నిర్లక్ష్యం మూలంగా ఆలయ పునర్నిర్మాణానికి నోచుకోలేదని ఎమ్మెల్యే ఆరోపించారు. పలుమార్లు ఈ విషయాన్ని అసెంబ్లీలో మాట్లాడడం, ముఖ్యమంత్రికి విన్నవించడం జరిగిందని తెలిపారు. బాసరకు ముఖ్యమంత్రి రావడం శుభ పరిణామన్నారు. బాసర ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఏప్రిల్ 6న బాసరకు రానున్న సీఎం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



