నవతెలంగాణ – అచ్చంపేట
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఆదివారం అచ్చంపేట పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఉప్పునుంతల రోడ్డు చివరస్తాలో తెలుగుదేశం పార్టీ దిమ్మె వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు సత్యనారాయణ మాట్లాడారు. 1982 మార్చి 29న ఆనాటి తారక రామారావు పార్టీని స్థాపించారని, రాజకీయంగా ఎందరో నాయకులకు భవిష్యత్తును కల్పించిందన్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం, పేద ప్రజల సంక్షేమo పైన అనేక పథకాలు అమలు చేయడం జరిగిందని గుర్తు చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అవతరణ తర్వాత తెలుగుదేశం పార్టీ ఆదరణ కరువైతుందన్నారు. భవిష్యత్తులో తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీకి మంచి ఆదరణ ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వెంకటరమణ, కృష్ణయ్య, తిరుపతయ్య, కాశన్న తదితరులు ఉన్నారు.
ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



