- Advertisement -
మాజీ కేంద్ర మంత్రి చారి
నవతెలంగాణ – ముధోల్
బాసర కు తెలంగాణ సిఎం రెవంత్ రెడ్డి ఏప్రిల్ 6న రానున్నట్లు మాజీ కేంద్ర మంత్రి సముద్రాల వేణుగోపాల్ చారి నవతెలంగాణ కు ఆదివారం రాత్రి పోన్ లో తెలిపారు. బాసర లో మాస్టర్ ప్లాన్ అమలు చేయడంతో పాటు, ఆలయపున నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా ముధోల్ లో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమాన్ని బాసరలోనే చేపడతారని తెలిపారు. బాసరకు అభివృద్ధి పనులు ప్రారంభించటానికి ముఖ్యమంత్రి రావడం సంతోషకరమన్నారు. బాసర అభివృద్ధి కీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసినందుకు సిఎంకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -


