Monday, March 30, 2026
E-PAPER
Homeసినిమామరో భిన్న ప్రేమకథ..

మరో భిన్న ప్రేమకథ..

- Advertisement -

భవ్య శ్రీ మూవీ మేకర్స్‌, నక్కిన నెరేటివ్స్‌ బ్యానర్ల మీద కండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నిర్మిస్తున్న చిత్రం ‘అనకాపల్లి’.
తమ్మినేని దర్శకత్వం వహిస్తున్నారు. కండ్రేగుల కుమార్‌ రాజా కో ప్రొడ్యూసర్‌గా చేసిన ఈ మూవీలో విక్రమ్‌ సహిదేవ్‌, సంధ్య వశిష్ట జంటగా నటించారు.
ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ ప్లేని అందించడమే కాకుండా త్రినాథరావు నక్కిన ఓ ముఖ్య పాత్రను కూడా పోషించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను రిలీజ్‌ చేశారు.
‘అనకాపల్లి.. ఇక్కడ మనకు కావాల్సింది దక్కాలంటే.. ఎదుటోడికి మనమంటే భయం ఉండాలి.. భయం లేనోడికి పిడికిలి రుచి చూపించాలి.. అదీ తెలిసినోడికి ఓబీ రుచి చూపించాలి.. అప్పటికీ లొంగకపోతే ఆడి పుర్రె పచ్చడయ్యేలా తూటాల వర్షం కురిపించాలి.. మనకి కావాల్సింది దక్కించుకోవాలి’.. అంటూ మొదలైన ఈ టీజర్‌లో అన్ని రకాల ఎమోషన్స్‌ చూపించారు.
మాస్‌ ఆడియెన్స్‌కి నచ్చే యాక్షన్‌ సీక్వెన్స్‌, యూత్‌ మెచ్చే లవ్‌ ట్రాక్‌, ఫ్యామిలీ ఆడియెన్స్‌కి కనెక్ట్‌ అయ్యే ఎమోషనల్‌ సీన్స్‌ ఇలా అన్నీ టీజర్‌లో ఉన్నాయి. ఇక అన్ని వర్గాల ఆడియెన్స్‌ని ఆకట్టుకోబోతున్నామని ఈ టీజర్‌తో టీం చెప్పకనే చెప్పేసింది. ఈ టీజర్‌లోని యాక్షన్‌ సీక్వెన్స్‌, విజువల్స్‌, మ్యూజిక్‌ ఇలా అన్నీ కూడా రా అండ్‌ రస్టిక్‌గా ఉన్నాయి. ప్రేమ కథ కూడా చాలా కొత్తగా ఉండబోతున్నట్టు అనిపిస్తోంది. మరి ఈ అనకాపల్లి కథ ఏంటో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే అని అంటున్నారు మేకర్స్‌. ఈ చిత్రాన్ని సమ్మర్‌ స్పెషల్‌గా రిలీజ్‌ చేయబోతున్నారు.
తారక్‌ పొన్నప్ప, త్రినాధ రావు నక్కిన, ఇంద్రజ అబ్సర్‌, మహబూబ్‌ బాషా, శ్రీనివాస్‌ వడ్లమాని, కాండ్రేగుల నాయుడు, నందిని రారు, సంగీత క్రిష్‌ తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి కథ-స్క్రీన్‌ప్లే: త్రినాధరావు నక్కిన, దర్శకుడు: ఖగేష్‌ తమ్మినేని, డీఓపీ : మాయా.వి, సంగీతం: దేవ్‌ జండ్‌, ఎడిటర్‌: శ్రీకష్ణ అట్టలూరి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సెట్రామరాజు మల్లెల, సంభాషణలు: ఉదరు భాగవతుల, ప్రొడక్షన్‌ డిజైనర్‌: రఘు కులకర్ణి, కొరియోగ్రఫీ: శేఖర్‌ Vజీ, యష్‌ మాస్టర్‌, జిత్తు మాస్టర్‌, సాహిత్యం: అనంత శ్రీరామ్‌, కెకె, గణేష్‌ సలాది, రాంబాబు గోశాల, తేజ గొర్లె, అదనపు పాటలు: వి.కిరణ్‌ కుమార్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -