Monday, March 30, 2026
E-PAPER
Homeజాతీయంపెరిగిన మాంసం ఎగుమతులు

పెరిగిన మాంసం ఎగుమతులు

- Advertisement -

ఆంక్షల బూచి చూపి విరాళాలు వసూలు
3.22 బిలియన్‌ డాలర్ల నుంచి 4.16 బిలియన్‌ డాలర్లకు చేరిక
కేంద్రం గణాంకాలు

న్యూఢిల్లీ : భారత్‌లో మాంసం అంటే మతం, రాజకీయం, సామాజిక అంశాలతో ముడిపడిన అంశం. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, పలు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఎన్ని కయ్యాక.. దేశంలో గోమాంసం పేరుతో ముస్లింలు, దళితులపై మూక దాడులు తీవ్రమైన విషయం విదితమే. దీంతో ఒకరకంగా దేశంలో పలు మాంసం ఎగుమతులపై ఆంక్షలు పెరిగాయి. ఇలాంటి పర మితుల నడుమే దేశంలో మాంసం ఎగుముతులు పెరిగాయి. గత ఐదేండ్లలో ఈ పెరుగుదల గణనీయంగా నమోదైనట్టు పార్లమెంటులో కేంద్రం వెల్లడించటం గమనార్హం. మాంసం ఎగుమతులకు సంబంధించిన వివరాలను తెలపాలంటూ పార్లమెంటులో సీపీఐ(ఎం) ఎంపీ జాన్‌ బ్రిట్టాస్‌ అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాచారాన్ని వెల్లడించింది. కేంద్రమంత్రి జితిన్‌ ప్రసాద్‌ ఈ సమాధానాన్ని ఇచ్చారు.

కేంద్రం సమాచారం ప్రకారం… 2020-21లో మాంసం ఎగుమతులు 3.22 బిలియన్‌ డాలర్ల విలువైన 10.98 లక్షల టన్నులుగా ఉండగా… అది 2021-25 నాటికి 12.74 లక్షల టన్నులకు పైగా నమోదై 4.16 బిలియన్‌ డాలర్లకు చేరింది. ఐదేండ్లలో మాంసం ఎగుమతులు స్థిరంగా పెరిగాయి. అయితే ఈ మాంసం ఎగుమతుల్లో గేదె మాంసం ఆధిపత్యం కనిపించింది. మొత్తం ఎగుమతుల్లో 97-98 శాతం ఈ మాంసమే ఉండటం గమనార్హం. ఇక గొర్రె, కోడి మాంసం వాటా తక్కువగా ఉంది. ఇక ఆవుమాంసం ఎగుమతి నిషేధం. రాష్ట్రాల వారీ డేటా ప్రభుత్వం వద్ద లేదు. దీంతో కేంద్రం మొత్తం ఎగుమతుల డేటాను వెల్లడించింది.

మాంసంపై మోడీ సర్కారు పలు ఆంక్షలు
అయితే ఈ డేటా ఒక పెద్ద విరుద్ధతను చూపిస్తోందని విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే.. ఒకవైపు మాంసంపై పరిమితులు, దుకాణాల మూసివేతలకు పిలుపులు, మత, సామాజికపరమైన ఒత్తిళ్లు ఉండగా, మరోవైపు మాంసం ఎగుమతుల పెరుగుదల, దానితో ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతోందని వివరిస్తున్నారు. మోడీ పాలనలో దేశంలో గోహత్య, గోమాంసం తరలింపు పేరుతో మాంసం వ్యాపారులు, ముస్లింలు, దళితులపై దాడులు తీవ్రమయ్యాయి. మూక హత్యలు ఆందోళన కలిగించాయి. ముఖ్యంగా, ఆరెస్సెస్‌ అనుబంధ సంఘాలు, బజరంగ్‌దళ్‌, వీహెచ్‌పీ వంటి హిందూత్వ శక్తులు మాంసం దుకాణాలను మూసివేయాలంటూ బెదిరింపులకు దిగాయి. అయితే వీటిని మోడీ ప్రభుత్వం అడ్డుకున్నట్టు కానీ, నిరోధించేందుకు తీసుకున్న చర్యలు కానీ అంతగా లేవని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.

బీజేపీకి రూ.30 కోట్లు విరాళం
ఇంకా విశేషమేమిటంటే.. తమకు తాము సాంప్రదాయాలను కాపాడే, హిందూ మతాన్ని రక్షించే రాజకీయ పార్టీగా చెప్పుకొనే బీజేపీకి ఇలాంటి మాంసం ఎగుమతిదారుల నుంచి కూడా పెద్ద ఎత్తునే విరాళాలు అందాయి. 160 ఏండ్ల చరిత్ర కలిగిన గేదె మాంసం ఎగుమతిదారు అయిన అల్లనా గ్రూపు బీజేపీకి రూ.30 కోట్ల విరాళాన్ని అందించడం గమనార్హం. ఆలయాల ముందు, హిందూ పండుగల సమయాల్లో మాంసాన్ని అమ్మద్దంటూ, గుడికి దూరంగా మాంసం విక్రయించాలంటూ పలు ఆంక్షలు విధించే బీజేపీ ప్రభుత్వాలు, దాని అనుకూల గ్రూపులు.. ఇప్పుడు అవే మాంసం ఎగుమతిదారుల నుంచి పెద్ద ఎత్తున విరాళాలు పుచ్చుకోవడం దేనికి సంకేతమని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -