Monday, March 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నాగాపూర్ లో చలివేంద్రం ఏర్పాటు

నాగాపూర్ లో చలివేంద్రం ఏర్పాటు

- Advertisement -

నవతెలంగాణ కమ్మర్ పల్లి 
మండలంలోని నాగాపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సోమవారం చలివేంద్రాన్ని  ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయం సమీపంలో ఏర్పాటుచేసిన ఈ చలివేంద్రాన్ని సర్పంచ్ కంపదండి అశోక్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి చింత రాజ శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రారంభించారు. వేసవి ఎండలు ముదిరిన నేపథ్యంలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం  హర్షనీయమని ఈ సందర్భంగా ఎంపీడీవో పేర్కొన్నారు. ప్రయాణికులు కూడా చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకొని దాహార్తిని తీర్చుకోవాలని కోరారు.కార్యక్రమంలో  పంచాయతి కార్యదర్శి సంధ్య, వార్డు సభ్యుడు సురేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలెపు రాజేశ్వర్, గ్రామ పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -