నవతెలంగాణ – భిక్కనూర్
ప్రాథమిక వ్యవసాయం సహకార సంఘం లిమిటెడ్, భిక్కనూర్ సంఘంలో మహాజన సభ సమావేశం సొసైటీ కార్యాలయ ఆవరణలో నిర్వహించారు. ఈ సమావేశానికి అధికార ప్రతినిధి ఇంచార్జ్ జి. రమేష్ అసిస్టెంట్ రిజిస్ట్రార్, ఆడిట్ అధికారి,జె. నగేష్ సీనియర్ ఇన్స్పెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సంఘ కార్యదర్శి యం. రాజు 01-10-2025 నుండి 20-03-2026 వరకు జరిగిన అర్ధవార్షిక కాలానికి సంబంధించిన జమ-ఖర్చులను సభలో ప్రవేశపెట్టారు. మహాజన సభలో రైతులు పలు ముఖ్యమైన అంశాలపై తమ అభిప్రాయాలు వెల్లడిస్తూ తీర్మానాలు చేశారు.
యూరియాను మండలాల వారీగా కాకుండా, సంఘానికి చెందిన గ్రామ పరిధిలోనే సరఫరా చేయాలని కోరారు. సంఘ సభ్యుల రుణాలను ఒకేసారి పూర్తిగా మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. వరి ధాన్యం పంటతో పాటు ఆరుతడి పంటలపై అవగాహన పెంచేందుకు రైతు వేదికలలో ప్రత్యేక సదస్సులు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ సొసైటీ చైర్మన్ నర్సింలు, మాజీ సొసైటీ వైస్ చైర్మన్ రాజిరెడ్డి, మాజీ సొసైటీ డైరెక్టర్లు, రైతులు, తదితరులు ఉన్నారు.



