నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని రామేశ్వర్ పల్లి గ్రామంలో లబ్ధిదారుల ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు భీమ్ రెడ్డి, సర్పంచ్ చేపూరి రాణీ రాజుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరవేస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి రాజబాబు గౌడ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు శ్రీరామ్ వెంకటేష్, ఉప సర్పంచ్ వినోద్ గౌడ్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్, వీడీసీ అధ్యక్షులు సూర్యకాంత్ రెడ్డి, ఆలయ పునర్ నిర్మాణ కమిటీ చైర్మన్ లింబాద్రి, భిక్కనూరు పట్టణ అధ్యక్షులు దయాకర్ రెడ్డి, ఆలయ డైరెక్టర్ రమేష్ రెడ్డి, భిక్కనూరు మాజీ సర్పంచ్ నర్సింహారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.



