- Advertisement -
నవతెలంగాణ – జన్నారం
పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న మాజీ సర్పంచులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు జాడి గంగాధర్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు సంబంధించి సుమారు 28 నెలలుగా బిల్లులు రాకపోవడంతో అప్పుల పాలయ్యామని తక్షణమే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు.
- Advertisement -



