Monday, March 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జుక్కల్ లో రసవత్తరంగా కుస్తీ పోటీలు

జుక్కల్ లో రసవత్తరంగా కుస్తీ పోటీలు

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
జుక్కల్ మండల కేంద్రంలోని మహాదేవుని మందిరం వద్ద ప్రతి సంవత్సరం బార్సి పండుగ సందర్భంగా గ్రామస్తుల ఆధర్యంలో నిర్వహించే కుస్తీ పోటీలకు సోమవారం భారీగా జన సందోహం కనిపించింది. కుస్తీ పోటీలు తిలకించేందుకు మూడు రాష్ట్రాలైన మహారాష్ట్ర,  కర్ణాటక ,తెలంగాణ నుండి మల్ల యోధులు వారి మద్దతుదారులు , మండలంలోని పలు గ్రామాల ప్రజలు భారీగా తరలివచ్చారు.

ఈ సందర్భంగా ఉదయం నుండి మహాదేవుని మందిరం వద్ద కోలాహలంగా మారింది. ఉదయం గ్రామస్తుల ఆధ్వర్యంలో మహా అన్నదానం నిర్వహించారు. పలు రాష్ట్రాల నుండి మండలంలోని గ్రామాలనుండి వచ్చిన భక్తులకు మహా అన్న ప్రసాదం నిర్వహించారు. కుస్తీ పోటీల ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించేందుకు జుక్కల్ పోలీసులు భారీగా బంధో బస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ సావిత్రి సాయ గౌడ్, టిఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు నీలు పటేల్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -