- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని మైబాపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సీసీరోడ్డు పనులను గ్రామ సర్పంచ్ బశ్యవ్వ అశోక్ రెడ్డి ఉప సర్పంచ్ తో కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలో అత్యవసరం ఉన్నచోట సీసీరోడ్డు వేయడం జరుగుతుందని ప్రజలకు సౌకర్యవంతంగా ఉండాలని ఉద్దేశంతో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ప్రోత్సాహంతో గ్రామాభవృద్ధికి గ్రామస్తుల సహకారంతో నిర్వహిస్తామని అన్నారు. రాబోయే రోజులలో గ్రామానికి సమస్యలు లేకుండా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను వెలికి తీసి పరిష్కరించే దిశగా కృషి చేస్తానని సర్పంచ్ అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అరిఫ్ తో పాటు ఉపసర్పంచ్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



