నవతెలంగాణ – ఆత్మకూరు
పరకాలలో అంబేద్కర్ సెంటర్లో సోమవారం ఆశా వర్కర్లు మహా ధర్నా చేపట్టారు. తమ కనీస వేతనం, ఇతర న్యాయమైన డిమాండ్లు పరిష్కారం కోరుతూ ప్రభుత్వాన్ని కోరారు. ఆత్మకూరు ఆశా వర్కర్లు ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ .. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో 18 వేల కనీస వేతనం, ఉద్యోగ భద్రత ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినా రెండున్నర సంవత్సరాలు గడిచినా చర్యలు లేవని ఆశా వర్కర్లు ఆక్షేపించారు. ఇటీవల ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో ఆశా వర్కర్లకు ఒక రూపాయి కూడా కేటాయించకపోవడం ఎలా 18 వేల వేతనం చెల్లిస్తారని ప్రశ్నించారు.
20 రోజులుగా ఆశా ఆడబిడ్డలు రోడ్లమీదికి వస్తున్నా అధికారులకు పట్టింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు నెలలుగా వేతనాలు పెండింగ్లో ఉంటే కుటుంబాలు జీవనం ఎలా కొనసాగుతాయని ప్రశ్నించారు. సమస్యలు పరిష్కారం కావడంతే పోరాటం చేస్తామని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పెరుమాండ్ల రమ, పెరుమాండ్ల అన్నపూర్ణ, తనుగుల ప్రసన్న, కొమ్ము కోమల, కోయిల అన్నపూర్ణ, కోయిల రాధా, ఇరస వడ్ల విజయలక్ష్మి, ఎలగొండ సుగుణ తదితరులు పాల్గొన్నారు.



