నవతెలంగాణ – తుంగతుర్తి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వృద్దులకు, వికలాంగులకు ఆసరా కోసం ఇస్తున్న ఆసరా పెన్షన్ డబ్బుల్లో రూ.16 కత్తెర చేయడం ఏంటని వృద్దులు, వికలాంగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా కూడా మండల పరిధిలోని అన్నారం గ్రామ పోస్టుమాన్ సమాధానం ఇవ్వకుండా తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఎఫ్డీలు చేసి ఐదు సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ, ఎఫ్డీ డబ్బులు ఇవ్వడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. నెల నెల మా దగ్గర నుండి ఎఫ్డి, డబ్బులు తీసుకుంటున్నాడు కానీ దానికి సంబంధమైన ఎలాంటి రసీదులు ఇవ్వడం లేదని, పాస్ పుస్తకాలు కూడా ఉన్నాయో లేదో తెలియదని ప్రజలు మొరపెట్టుకుంటున్నారు.
ఎఫ్డీలు రెండు మూడు సంవత్సరాలు కట్టి చనిపోయిన వ్యక్తుల యొక్క నామినీలకు కూడా ఎలాంటి లబ్ధి చేకూరలేదని పలువురు ఆరోపిస్తున్నారు. గ్రామంలో జరిగిన సంఘటనపై జిల్లా పోస్టల్ అధికారులు విచారణ జరిపి పెన్షన్ దారులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. చెడుపాక ముత్తమ్మ. (బాధితురాలు) నా భర్త చెడుపాక లచ్చయ్య ఏప్రిల్ 2022 నుండి 2025 జనవరి వరకు ప్రతి నెల రూ.1000 చొప్పున, 34 నెలల్లో రూ.34000 వేలు పోస్టల్ లో డిపాజిట్ చేయడం జరిగిందని, 2025 ఫిబ్రవరిలో లచ్చయ్య మరణించడం జరిగిందని, సంవత్సరం పూర్తి అయినప్పటికీ ఎలాంటి ఇన్సూరెన్స్ ఇవ్వలేదని, కనీసం మేము కట్టిన డబ్బులు కూడా ఇవ్వలేదని తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి తగిన న్యాయం చేయాలని బాధితురాలు వేడుకుంటున్నారు.



