నవతెలంగాణ – తుంగతుర్తి
డిఫెన్స్ డ్రైవింగ్ ద్వారా జాగ్రత్తగా వాహనం నడిపితే ప్రమాదాలను నివారించవచ్చునని తుంగతుర్తి సీఐ నరసింహారావు పేర్కొన్నారు. సోమవారం అరైవ్, అలైవ్ కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎస్సై క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో తుంగతుర్తి మండల కేంద్రంలో వాహనదారులకు ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించి మాట్లాడారు. ఈ మేరకు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం వల్ల అనుకోని రోడ్డు ప్రమాదాలలో ప్రాణాపాయం నుండి రక్షణ పొందవచ్చునని సూచించారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం పోలీసుల బాధ్యత అన్నారుడిఫెన్స్ డ్రైవింగ్ ద్వారా ప్రమాదాలను నివారించవచ్చు- తుంగతుర్తి సీఐ.ప్రజల్లో శాశ్వతంగా మార్పు రావాలంటే ప్రతీ వాహనదారుడు తన మనసులోనే ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించాలనే సంకల్పం తీసుకోవాలన్నారు.
మద్యం సేవించి వాహనం నడపడం చిన్న తప్పు కాదని, అది తన కుటుంబాలకే కాక ఇతర కుటుంబాలకు కూడా అపార నష్టం కలిగిస్తుందన్నారు. ప్రాణకంటే విలువైంది ఏది లేదని,ప్రాణం ఉంటేనే ఏదైనా సాధించవచ్చునన్నారు. రహదారి భద్రత నియమాలను పాటించడం ద్వారా ప్రమాదాలను ఘనంగానీయంగా తగ్గింవచ్చునన్నారు. ప్రమాదంలో తప్పు ఎవరిదన్నదానికంటే, దాని వల్ల ఎన్ని కుటుంబాలు ఇబ్బంది పడుతాయో గుర్తుంచుకోవాలన్నారు. ప్రతి ప్రయాణం సురక్షిత గమ్యం చేరడమే లక్ష్యంగా పోలీస్ శాఖ ప్రజలకు రోడ్డు నియమాల పట్ల జాగ్రత్తల పట్ల విస్తృతంగా అవగాహన కల్పిస్తుందని ప్రజలు వాహనదారులు గమనించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వాహనదారులు మండల ప్రజలు తదితరులు ఉన్నారు.



