దుర్గా భవాని తండా గ్రామపంచాయతీ సర్పంచ్ భూక్య వీరన్న
నవతెలంగాణ – నెల్లికుదురు
మండలంలోని దుర్గాభవాని తండా గ్రామపంచాయతీకి నూతన గ్రామపంచాయతీ బిల్డింగ్ కు ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ సహకారంతో పనుల ప్రారంభించినట్లు ఆ గ్రామ సర్పంచ్ భూక్య వీరన్న తెలిపారు. ఐటీడీఏ ఎస్ టి ఎస్ డి ఎఫ్ నిధులైన రూ.20 లక్షలతో ఏఈ ఎర్రన్న తో కలిసి సోమవారం పనులకు ప్రారంభించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ దుర్గాభవాని తండా గ్రామపంచాయతీకి సరిపడా భూమిని దాతగా ఇవ్వడానికి ముందుకు వచ్చిన గుగులోతు జాములకు తండావాసులు రుణపడి ఉంటారని అన్నారు.
ఈ సందర్భంగా అతని అభినందించినట్టు తెలిపారు. గత కొన్ని ఏళ్ల నుండి ఈ గ్రామ పంచాయతీకి గ్రామపంచాయతీ బిల్డింగ్ లేక ఇక్కడ ప్రజలు అనేక ఇబ్బంది పడ్డారని ఇప్పుడు మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ సహకారంతో గ్రామపంచాయతీ బిల్డింగ్ కు నిధులు మంజూరు చేయించి మా గ్రామానికి సహకారం అందించాడని అన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు అని అన్నారు. ఈ గ్రామపంచాయతీ బిల్డింగ్ ఏర్పడితే ఈ తండావాసులు సమస్యలు పరిష్కరించుకునేందుకు అనుకూలంగా ఉంటుందని అన్నారు.
గత ప్రభుత్వం చేయని పనులు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ భూక్య వీరన్న వార్డు సభ్యులు భూక్య రమేష్ గుగులోతు శోభ గ్రామ పార్టీ అధ్యక్షుడు లాలు తో పాటు కొంతమంది నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.



