- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18 వేలు ఇవ్వాలని నేడు సీఐటీయూ అధ్వర్యంలో వందలాది మంది ఆశా వర్కర్స్ జడ్చర్ల నెషనల్ హైవే 44పై రాస్తారోకో నిర్వహించారు. దాదాపు 2 గంటల ఈ రాస్తారోకో చేశారు. దీంతో 10 కిలో మీటర్ల దూరం పాటు వాహనాలు నిలిచిపోయాయి. పోలీసుల జోక్యంతో తోపులాట జరిగింది. ఈ ఘర్షణలో సీఐటీయూ ఆశా యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు జయలక్ష్మి స్పృహ తప్పి పడిపోయారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇంకా ఈ ఘటనలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు దీప్లా నాయక్, ఉపాధ్యక్షుడు సత్తయ్య, ఆశా యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సావిత్రి, సాధన, తదితరులకు గాయాలు అయ్యాయి.




- Advertisement -



