Tuesday, March 31, 2026
E-PAPER
Homeసినిమాహృదయానికి హత్తుకునే సినిమా

హృదయానికి హత్తుకునే సినిమా

- Advertisement -

పాత్‌వే ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై అరుణ్‌ రంగరాజులు నిర్మాతగా రామ్‌ చక్రి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’. సముద్రఖని ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. లక్ష్మీ ప్రియా, అభినయ, కార్తిక్‌ కుమార్‌, బడవ గోపీ, కోతండం, కరణ్‌ చక్రవర్తి, శంకర నారాయణ్‌ వి, హరిత పరాకోడ్‌ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. మ్యూజిక్‌ యాజ్‌ ఏ సర్వీస్‌ అంటూ మ్యూజిక్‌ క్లౌడ్‌ స్టూడియో అండ్‌ టెక్నాలజీ పేరుతో రామానుజన్‌ ఎంకే తమ సంస్థ ద్వారా ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఇప్పటికే విడుదలైన ‘అరెరె’ పాట ఎమోషనల్‌గా ప్రేక్షకుల మనసులను హత్తుకుంది. ఏప్రిల్‌ 3న తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌ కాబోతుంది. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ పీవీఆర్‌ ఐనాక్స్‌ పిక్చర్స్‌ ద్వారా ఈ చిత్రం థియేటర్స్‌లోకి రానుంది. ఈ సందర్భంగా సంగీతం దర్శకుడు రామానుజన్‌ చిత్ర విశేషాల గురించి మీడియాతో ముచ్చటించారు.

‘ఒక చిత్రానికి సంగీతాన్ని అందించిన ఘనత ఏ ఒక్క వ్యక్తికీ కాకుండా, ఒక సంస్థకు దక్కాలని కోరుకున్నాం. అందుకే ఈ సినిమాకు సంగీత దర్శకుడి పేరు కాకుండా.. (మ్యూజిక్‌ యాజ్‌ ఏ సర్వీస్‌) మ్యూజిక్‌ క్లౌడ్‌ స్టూడియో అండ్‌ టెక్నాలజీ పేరును ప్రకటించాం. సినీ సంగీత రంగంలో ఇదొక కొత్త ప్రభంజనం అనుకోవచ్చు. నేను గతంలో దర్శకుడు రామ్‌తో కలిసి అమృత శ్రీనివాసన్‌ ప్రధాన పాత్ర పోషించిన ‘కురైయొండ్రుమ్‌ ఇల్లై’ చిత్రానికి పనిచేశా. ఇప్పుడు ‘కార్మేని సెల్వం’ లాంటి గొప్ప ఫ్యామిలీ ఎమోషనల్‌ చిత్రానికి సంగీతం అందించే అవకాశం వచ్చింది. ఈ సినిమా కోసం 4 పాటలు, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌, ఓఎస్‌టీ ట్రాక్స్‌ కంపోజ్‌ చేశాను. ‘అరెరె’ పాటకు తెలుగులో అద్భుతమైన రెస్పాన్స్‌ వస్తోంది. తండ్రి-కొడుకు మధ్య బంధాన్ని చూపించే సందర్భంలో ఈ పాట వస్తుంది. సముద్రఖని, గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌ నాకు పూర్తి ఫ్రీడమ్‌ ఇచ్చారు. ప్రొడ్యూసర్‌ అరుణ్‌ రంగరాజులు చాలా సపోర్ట్‌ చేశారు. ఈ సినిమా గురించి ఒక్కమాటలో చెప్పాలంటే హృదయానికి హత్తుకునే సినిమా. మన జీవితంలో ఎదురయ్యే భావోద్వేగాలను ప్రతిబింబిస్తుంది’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -