హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా ‘కలర్ ఫొటో’, ‘బేబి’ వంటి కల్ట్ క్లాసిక్ మూవీస్ ప్రేక్షకులకు అందించిన మేకర్స్ ఎస్‌కేఎన్, సాయి రాజేశ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’. ఈ చిత్రాన్ని అమత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై ఎస్ కేఎన్, సాయి రాజేశ్ నిర్మిస్తున్నారు. సాయి రాజేశ్ కథను అందిస్తున్న ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ తుది దశలో ఉంది. మణిశర్మ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. సోమవారం ఈ సినిమా నుంచి ‘గుర్తుందా..’ సాంగ్ లాంచ్ ఈవెంట్‌ను మేకర్స్ ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నిర్మాత ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ,”బేబి’ సినిమా తర్వాత ఈ సినిమాతో మరోసారి తమతో కలిసి వర్క్ చేసే అవకాశం కల్పించిన సాయి రాజేశ్, ఎస్ కేఎన్‌కు థ్యాంక్స్. ‘బేబి’ సినిమా కంటే పది రెట్లు పెద్ద విజయాన్ని ఈ సినిమా సాధిస్తుంది. ఈ చిత్రంలో ఏడు పాటలు ఉన్నాయి. మొదటి పాట ఇది. ఈ చిత్రంలోని పాటలన్నీ ఒక్కోటి 100 మిలియన్ వ్యూస్ దాటేస్తాయి. ఈ కథ విన్నప్పుడే హీరో కిరణ్ అబ్బవరం బ్లాక్‌బస్టర్ మూవీ చేస్తున్నామని, ఓకే చెప్పారు. ‘క’ సినిమా తర్వాత ఆయన ఒప్పుకున్న చిత్రమిది. ఈ బ్లాక్ బస్టర్ మూవీలో భాగమైనందుకు సంతోషంగా ఉంది’ అని అన్నారు.
”బేబి’ మూవీ విజయం తర్వాత మేము డబ్బుల వెనక పరుగు పెట్టలేదు. ఒక మంచి కథతో మళ్లీ మూవీ చేయాలని అనుకున్నాం. ‘బేబి’ సినిమాకి దర్శకుడు రవి ఎంతో సపోర్ట్ చేశాడు. కతజ్ఞతగా రవిని ఈ సినిమా చేయమని రిక్వెస్ట్ చేశా. ఇప్పుడు కూడా ఒక గొప్ప సినిమా చేసి నాకే మంచి చేశాడు రవి. ఈ సినిమా కొంత భాగం నేను చూశాను. సినిమా చూస్తూ కన్నీళ్లు ఆపుకోలేక పోయాను. రవి అంత బాగా తెరకెక్కించాడు. ఈ చిత్రంలో హీరోకు సమానంగా ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర హీరోయిన్‌ది. గతేడాది తమిళ సినిమాకు ఫిలింఫేర్ తీసుకున్న శ్రీ గౌరి ప్రియ..ఈసారి తెలుగు సినిమాకు తీసుకుంటుంది. అంత బాగా పర్‌ఫార్మ్ చేసింది. అనంత శ్రీరామ్‌తో వర్క్ చేస్తే లిరిక్స్ గురించి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆయన మీద పూర్తిగా ఆధారపడతా. ‘బేబి’కి ఎంతో మంచి సాంగ్స్ రాశారు. ధీరజ్ మంచి ఫ్రెండ్. ఆయన ఈ మూవీని మరింత గ్రాండ్‌గా మీ ముందుకు తీసుకురాబోతున్నారు.
నేను పూర్తిగా నమ్మి టెన్షన్ లేకుండా వర్క్ చేసుకుంటున్నా అంటే కారణం ఎస్ కేఎన్. ఈ సినిమాలో కిరణ్ పర్‌ఫార్మెన్స్ గురించి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడుతాను. ఈ సినిమా ఆయనకు ఒక మెమొరబుల్ మూవీ అవుతుంది. మణిశర్మ తనదైన శైలీలో సంగీతాన్ని అందించారు’ అని తెలిపారు. మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ మాట్లాడుతూ,’సాయి రాజేశ్‌తో మూవీ కోసం డిస్కషన్స్ చేస్తూ బ్రహ్మాండమైన ట్యూన్స్ కుదిరాయి. పాటలు విని మీరు చెప్పాలి. కిరణ్‌తో నేను చేస్తున్న రెండో చిత్రమిది’ అని చెప్పారు. ‘నేను ఇంత పెద్ద స్పాన్ ఉన్న మూవీ చేస్తున్నానంటే అందుకు కారణం ఎస్ కేన్, సాయి రాజేశ్’ అని డైరెక్టర్ రవి నంబూరి అన్నారు. నిర్మాత ఎస్ కేఎన్ మాట్లాడుతూ,’మంచి కథల్ని ప్రేక్షకులకు చూపించాలనే తపన ఉన్న హీరో కిరణ్. ఈ కథను నిర్మించాలంటే మీకు ధైర్యం ఉండాలి, నటించాలంటే నాకు ధైర్యం ఉండాలి అంటూ శ్రీ గౌరి ప్రియ ఈ ప్రాజెక్ట్ కు ఓకే చెప్పింది. ఈ సినిమాలోని ప్రతి ఫ్రేమ్, ప్రతి సీన్, ప్రతి డైలాగ్ అందరికీ అలాంటి ఎగ్జైట్‌మెంట్ ఇస్తుంది’ అని చెప్పారు.
‘ఈ మూవీ డాల్బీలో చేస్తుండటం సంతోషంగా ఉంది. ఈ మూవీలో హీరోయిన్ ఒక దేవతలా అనిపించాలి. అలాంటి నివి పాత్రలో శ్రీ గౌరి చాలా బాగా పర్‌ఫార్మ్ చేసింది. దర్శకుడు రవి నంబూరితో వర్క్ చేయడం సంతోషంగా ఉంది. ఆయన రాసిన డైలాగ్స్ నటుడిగా నన్ను మరింత ఎగ్జైట్ చేశాయి. సాయి రాజేశ్ కథ చెప్పినప్పుడే ఈ సినిమా బలంగా ఉండబోతోంది అని అర్థమైంది. ఎస్‌కేఎన్ ప్యాషన్ ఉన్న నిర్మాత’. – హీరో కిరణ్ అబ్బవరం



