– డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డిటిఎఫ్)
నవతెలంగాణ – మల్హర్ రావు:
ఇరాన్ పై అమెరికా ఇజ్రాయిల్ దేశాల కూటమి చేస్తున్న యుద్ధాన్ని వెంటనే నిలిపివేయాలని, ఈ యుద్ధ వ్యతిరేక చర్యల్లో భారత ప్రభుత్వము చొరవలో ముందుండాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ తిరుపతి డిమాండ్ చేశారు. డి టి ఎఫ్ మలహర్రావు మండల కౌన్సిల్ సమావేశము కొయ్యోరులోని ఎంపీపీ ఎస్ కొయ్యూరు పాఠశాలలో మండల అధ్యక్షులు డాక్టర్ షేర్ మహరాజ్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఏ తిరుపతి మాట్లాడుతూ సామ్రాజ్యవాద దేశమైన అమెరికా తన ఆర్థిక దాహాన్ని తీర్చుకోవడానికి కుంటి సాకులతో చిన్న దేశాల పైన దాడులు చేస్తూ వారి సార్వభౌమధికారాన్ని, అస్తిత్వాలను కొల్లగొడుతూ తమ చెప్పు చేతుల్లో ఉంచుకునే విధంగా కీలుబొమ్మ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తూ వలస దేశాలుగా మార్చుకుంటుంది. ఇరాన్‌లోని పసిపిల్లలు సహా యువకులు వృద్ధులను ఎంతోమందిని బలితీసుకుంటూ నరమేధాన్ని జరుగుతుంది. ఇది అత్యంత దుర్మార్గం అన్నారు. ఆధునాతన సాంకేతికతతో వాస్తవాలను అవస్తవాలుగా ప్రపంచంలో ప్రచారం చేస్తూ వివిద దేశాల ప్రజల ఆకలి అర్ధనాథాలకు కారకులు అవుతున్న అమెరికా ఇజ్రాయిల్ సామ్రాజ్యవాద దేశాల ఓటమికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాల ప్రజలు యుద్ధ వ్యతిరేక ప్రదర్శనలు చేయాలని విజ్ఞప్తి చేశారు. యుద్ధ వ్యతిరేక ప్రదర్శనలకు భారత ప్రభుత్వమే చొరవ తీసుకొని ముందుండాలని అదేవిధంగా శాంతి వాతావరణంలో నెలకొల్పడానికి దేశంలోని ప్రజలంతా కూడా యుద్ధ వ్యతిరేక నిరసన ప్రదర్శనలు జరపాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశానికి గౌరవ అతిధులుగా వచ్చిన జిల్లా కార్యదర్శి ఏ బొజ్జా నాయక్ , డి టి ఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ టి సుదర్శనం మాట్లాడుతూ రాష్ట్రంలో ఎప్పుడో ఇవ్వాల్సిన పి ఆర్ సి ని ఇవ్వకపోవడం చాలా బాధాకరమని అదే విధంగా పెండింగ్ లో ఉన్న ఐదు డిఏ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో విద్యారంగ బడ్జెట్ సుమారు 8% కేటాయించడం చూస్తే రాష్ట్ర విద్యారంగ రూపురేఖలు ఎలా ఉండబోతున్నవో అర్థం అవుతుందన్నారు. అణగారిన వర్గాలకు విద్యా అందుబాటులో ఉండాలంటే బడ్జెట్లో 20% కేటాయించాలని అప్పుడే కొంత న్యాయం జరుగుతుందన్నారు. ఈ కౌన్సిల్ సమావేశంలో డి టి ఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి డి చంద్రశేఖర్ మౌఖిక నివేదికను ప్రవేశపెట్టారు. తదుపరి పాత మండల కమిటీని రద్దు చేసి కొత్త మండల కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నికకు ఎన్నికల అధికారిగా టిటిఎఫ్ జిల్లా కార్యదర్శి ఏ బొజ్జ నాయక్ మరియు ఎన్నికల పరిశీలకులుగా డి టి ఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ టి సుదర్శనలు వ్యవహరించారు.
కొత్త కమిటీకి మండల అధ్యక్షులుగా డాక్టర్ షేక్ మెహరాజ్, మండల ఉపాధ్యక్షులుగా ఎం శివకృష్ణ, కే రాధిక,, పి సత్యనారాయణ, మండల ప్రధాన కార్యదర్శిగా డి చంద్రశేఖర్ ఎన్నిక కాగా కార్యదర్శులుగా ఎం ప్రకాష్, బి కవిత ఎల్ జగన్ నాయక్ ఆర్ హరీష్, జిల్లా కౌన్సిలర్లుగా టి సుదర్శనం , ఏ స్నేహ , వి కుమారస్వామి , సిహెచ్ తిరుపతి, ఆడిట్ కమిటీ కన్వీనర్ గా ఎం నరసయ్య సభ్యులుగా సిహెచ్ రమేష్ బాబు ఎం రమేష్ జి రామకృష్ణ ులు ఎన్నికయ్యారు



